దేవుడు ఉన్నాడా లేడా,
"ఉంటే ఏలా ఉంటాడు .మనకు ఏందుకు కనిపించడు, అసలు దేవుడు లేడు"
కాసింత సదువు కుసింత డబ్బు చూస్తే చాలు చాలా మందికి దేవుడి మీద నమ్మకం ఉండదు.
జ్యొతిష్యం చేప్పేవారు అబద్దల కోరులని చేప్పేవారికి వారి వల్ల ఏవరికి నష్టం వచ్చిందో శేలవిస్తే విని తరిస్తాము.మరి దేవుడు లేడని నమ్మినవారు చేసింది ఏమిటొ.
ఖచ్చితనంగా దేవుడు లేడని విమర్షించే హాక్కు ఏవరికి లేదు.ఒక్క వేల అలా అన్నవారికి ఇప్పటికిప్పుడు అయన మహత్యలు ,శక్తులు చూపవలసిన అవసరం లేదు.
దేవుడు ఉనికి ప్రశ్నించే హక్కు వీరికి ఏవరు ఇచ్చారు.
అంతా తానే అనుకుంటున్న మనిషి అసలు అతను ఏ వస్తువు నుంచి పుట్టాడని అలోచిస్తే అతని విలువ ఏంటొ అతనికి తేలుస్తుంది.
ఇక మనోళ్ళు మరి ఒవర్.
హిందువులలో జాతి వివక్ష ఉంది అన్నారు మరి నేడు రిజర్వేశన్ ల రూపంలో వారికి మెదటి హక్కు ఇచ్చింది ఏవరు ముమ్మటికి ఆ హీందువులే.
పరమతస్తులైన ముస్లిములు,క్త్రేస్తవులకు వారి పుర్తి స్వేచ్చవారికి ఇచ్చింది ఏ దేశం మన హీందుదేశం.
అటువంటిది ఇక్కడ ఉండి ఇక్కడ అబివృద్ది ఫాలాలను మెదట పోందుతు అటువంటి మతాన్ని విమర్శించే వారిని చూస్తుంటే.........
మనవారే మన మాతాన్ని, ఆచారాలని గౌరవించనప్పుడు కుడా వారికి పుర్తి వ్యక్తి స్వేచ్చను ఇస్తుంది మన దేశం.
అందుకే ఏందరు ఏన్ని కారు కుతలు కూసిన వారిని క్షమీంచి వదిలేస్తుంది.
ఇదంతా కేవలం హిందు మతం యెక్క గొప్పదనం.



36 comments:
YOU ARE RIGHT
Let there be GOD. Who has problem with it?
సమస్య దేవుడు కాదు,మతం.
ఇక "ఇచ్చాం ఇచ్చాం" అనే మీ arrogance ఉంది చూశారూ, అసలు సమస్యలన్నిటికీ మూలకారణం అదే. హిందువులెవరు ఇవ్వడానికి,ఇతరులెవరు పుచ్చుకోవడానికి? అందరూ సమానమనే మూలభావనకే నీలాంటోళ్ళొక గొడ్డలిపెట్టు.
మహేష్ గారు,
lot of people have problem with god not religion.
అందరు సమానం అయినప్పుడు మరి హీందువు ఏవరినో కీంచ పరుస్తున్నారు గౌరవించడం లేదు అని గోల ఏందుకు
ఇక్కడ ఇస్తునది అలా కించపరిచారు అని తేగ ఫిల్ అయిపోతున్న వారి కోసమేనండి.
మళ్ళి ఛెబుతున్నాను అవును మేమే ఇచ్చాం
గౌరవం కోసం పోరాడటాన్ని "గోల" అంటున్న మీ అవగాహనకు జోహార్లు. ఇలాంటి అవగాహనలే సమస్యకు మూలకారణాలు.
ఇచ్చేది తీసుకుంటు .మళ్ళి మాకు అవమానం జరుగుతుంది అనేవరిని ఏమనాలి
రిజ్వషన్లు పోందేటప్పుడు చేప్పుకునే మతం అన్ని వేలల ఏందుకు చేప్పుకోవడం లేదో
రిజ్వషన్లు పోందేటప్పుడు చేప్పుకునే మతం,కులం అన్ని వేలల ఏందుకు చేప్పుకోవడం లే
కులానికి మూలాలు మతంలో ఉన్నా,ఇప్పుడు అదొక సామాజిక సమస్య.మతానికి అతీతంగా దానికి సమాధానం కావాలి.
హక్కులు ఎవరూ ఇవ్వరు. అవి పోరాడి సాధించుకునేవి. రిజర్వేషన్ కూడా అలాంటిదే.
రిజర్వేషన్ల వల్ల ఆర్థికంగా ఎదగవచ్చెమో కాని మీ అలోచనా విధానం మారనంత వరకు మానసికంగా మీరు ఎల్ల కాలం వెనుకబడే ఉంటారు, ఇది నిజం
అయ్య అనానిమస్ గారూ, రిజర్వేషన్లవల్ల పైచదువులు చదువుకునే అవకాశం వస్తుంది,గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశించే అవకాశం లభిస్తుంది. ఇవిరెండూ మానసికంగా,సామాజికంగా ఎదిగే విషయాలే...ఆర్థిక బలిమి చదువువలనా ఉద్యోగం వలనా రావు.తాతముత్తాతలు సంపాదించిన ఆస్తులు,పొలాలూ ఉంటే వస్తాయి.
మహేష్ రిజర్వేషన్ వల్ల పైచదువు చదువుకునే అవకాశం! గౌరవప్రదమైన ఉద్యోగాల్లో ప్రవేశించే అవకాసమ్!!!
నిజమా?
నేనింతకాలం విధ్యనేర్చుకుంటే జ్ఞనాన్ని పెంచుకుంటే పైచదువులు చదవచ్చొ అనుకున్నా! దానికి ప్రభుత్వ ఉచిత నిర్భంద విధ్య చాలునని అనుకున్నా! టీచర్స్ చిత్తశుద్ది, విధ్యార్ధుల శ్రద్దా ఆసక్తి చాలుననుకున్నా!!
రిజర్వేషన్ వల్ల గౌరవ ప్రదమైన ఉధ్యోగాల్లో ప్రవేశించే అవకాశం!
గౌరవప్రదమైనా అంటే??
ఉద్యోగ అర్హత రిజర్వేషన్?
కష్టపడి పడి చదువుకుంటే దానిద్వార కలిగే విషయ పరిజ్ఞానం నేర్పూ సమర్ధతా ఇవీ ఉద్యోగ అర్హతలూ అనుకుంటున్నాను నేను ఇన్నాళ్ళూ!!
@katti
"ఇవిరెండూ మానసికంగా,సామాజికంగా ఎదిగే విషయాలే" are you sure??
మీరు చెప్పేదే నిజమైతే రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం సంపాదించిన వ్యక్తి తన కొడుకుకు మళ్ళీ రిజర్వేషన్ కవాలని ఎందుకు కోరుకుంటున్నారు?మీరు సామజికంగా ఎదిగారు కదా??
ఇంతా చేసి MRO మొదలుకొని IAS,IPS ల కూడా promotions లో రిజర్వేషన్లు కావలనుకొనే వీళ్ళు మానసికంగా ఎదిగారా??
I am first anonymous
కొన్ని వందల తరాల నుంచి అణగదొక్కబడిన వర్గాలు, ఇతరులతో సమానం గా ఎదిగేందుకు కొన్ని పదుల తరాలు ఐనా పడుతుంది. అప్పటి వరకు రిజర్వేషన్లు అవసరము. కాబట్టి రిజర్వేషన్లు అణగారిన వర్గాల హక్కు.
అది అర్థం చేస్కోకుండా ఏడిచేవాళ్ళు , ఏడుస్తూనే ఉండచ్చు. అది వారి హక్కు.
@'ఇచ్చాము, ఇస్తున్నాము' అని ఫీల్ అయ్యే వాళ్ళు : ఎవడబ్బ సొమ్మని ఇస్తారు ? తరతరాలుగా దోచుకున్నది ఎప్పటికి నీది కాదు. అది కక్కవలసిందే, లేదంటే తలకిందులుగా వేలాడ దీసి మరి కక్కి౦చవలసి౦దె !
బాబూ తెలుగోడు
తరతరాలుగా దోచుకున్న వాళ్ళకు ఉధ్యోగాలెందుకు బాబూ. దోచున్న వాళ్ళెవరూ ఇప్పుడు ఉధ్యోగాలు చేయటలేదు. వాళ్ళంతా నాయకులై పరి పాలిస్తున్నారు. ఉధ్యోగాలకొచ్చే వాళ్ళంతా పొట్టకూటికే. పొట్టకూటుకి వచ్చేవాళ్ళ పొట్టలను కొడుతూ ఉన్నారు రిజర్వేషన్లపేరుతో
ఎవరిచ్చారూ?
రాజ్యాంగం.
అదేంటీ?
ప్రజల చేత ప్రజలకొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రతిధులు రాసిన, రాయించుకున్న లేక ప్రతినిధుల చేత ఏర్పరచచ్బడిన ఒక ప్రక్రియ (ప్రాసెస్ లేక బాడీ) రాసిన పుస్తకం. కాబట్టి రిజర్వేషన్స్ అనేవి ప్రజలే డైరెక్టుగా కానీ ఇన్డైరెక్టుగా కానీ ఏర్పరచుకున్న ఓ ప్రక్రియ. ఐతే చిత్తశుద్ధి లేని రాజకీయనాయకులు దాన్ని పిచ్చివాడి చేతిలో రాయి చందాన చేసారు. విలువ లేకుండా చేసారు. కత్తి లాంటి కుచ్చాలు దాన్ని అడ్డంపెట్టుకుని పైకి ఎదుగుతూకూడా, అదే సమాజంపై ద్వేషాన్ని పెంచుకుంటున్నారు, ఇలా ఆటల్లో అరటిపండులా అవుతున్నారు. సో స్యాడ్!! ఐ పిటీ హిం.
>>
హక్కులు ఎవరూ ఇవ్వరు. అవి పోరాడి సాధించుకునేవి. రిజర్వేషన్ కూడా అలాంటిదే.
>>గౌరవం కోసం పోరాడటాన్ని "గోల" అంటున్న మీ అవగాహనకు జోహార్లు. ఇలాంటి అవగాహనలే సమస్యకు మూలకారణాలు.
అంటే గౌరవం అనేది ఓ హక్కా?
ఏరకంగా?
రిజర్వేషన్ అనేది కూడా హక్కా? ఎలా?
>>కులానికి మూలాలు మతంలో ఉన్నా,ఇప్పుడు అదొక సామాజిక సమస్య.మతానికి అతీతంగా దానికి సమాధానం కావాలి.
మతానికి అతీతంగా రిజర్వేషన్ అనే ప్రక్రియకి సమాధానం కావాలా? అద్దిరింది.
ఐతే - సాధించి సోధించి హ్యూమనిస్ట్ అనే ట్యాగ్ పెట్టుకుని తిరిగే నీలాంటివాళ్ళకి అసలు కులం మతం అంటదు కదా కత్తీ? మరి ఇదేంటి??
కులాలకి మతాలకి అతీతంగా రిజర్వేషన్స్ కావాలీ అంటే దళిత అనే మాటే ఉండకూడదు. యస్సి యస్టి అనే మాటే ఉండకూడదు. మరి ఏ బేసిస్ మీద రిజర్వేషన్ ఇవ్వాలి?
కత్తి - నీ ఆలోచనా మూలాల్లోనే లోపం ఉన్నట్టు నీకు అనిపించటం లేదా?
రిజర్వేషన్ అనేది అవసరం లేదు, దాని స్థానే, ఇంకో గట్టి సిస్టం ఆవశ్యకత ఎంతైనా ఉందీ అని నువ్వన్నప్పుడు కనపడు మనం మాట్లాడుకుందాం.
>>రిజర్వేషన్లవల్ల పైచదువులు చదువుకునే అవకాశం వస్తుంది
అవకాశం రాదు, ఇవ్వబడుతుంది.
>>గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశించే అవకాశం లభిస్తుంది.
లభించదు, ఇవ్వబడుతుంది.
>>ఇవిరెండూ మానసికంగా,సామాజికంగా ఎదిగే విషయాలే
మానసికంగా ఎదగటానికీ ఉద్యోగలు ఎలగబెట్టటానికీ సంబంధం లేదు. సామాజికంగా ఎదగటానికి ఉద్యోగమే చెయ్యాల్సిన పనిలేదు.
>>...ఆర్థిక బలిమి చదువువలనా ఉద్యోగం వలనా రావు. తాతముత్తాతలు సంపాదించిన ఆస్తులు,పొలాలూ ఉంటే వస్తాయి.
ఛా?? ఆర్ధిక బలిమి సంపాదించిన దాంట్లో కొంత శాతాన్ని కూడబెడుతూ, రకరకాల ఆలోచనలు చేస్తూ రకరకాల ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ వెళ్తే వస్తుంది.
ఇంకోమాట నీ కత్తిలాంటి బుర్రకి అర్ధంకాకపోయినా, ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్కోడం కులాతీతం మరియూ మతాతీతం కూడా.
ఓరి తెలుగోడు, ఏందయ్యా నీ గోడు -
>>@'ఇచ్చాము, ఇస్తున్నాము' అని ఫీల్ అయ్యే వాళ్ళు : ఎవడబ్బ సొమ్మని ఇస్తారు ? తరతరాలుగా దోచుకున్నది ఎప్పటికి నీది కాదు. అది కక్కవలసిందే, లేదంటే తలకిందులుగా వేలాడ దీసి మరి కక్కి౦చవలసి౦దె !
కెవ్వు.
పవన - ఇచ్చేది తీస్కుంటూ ఏంటీ? ఇవ్వకపోయినా లాక్కుంటూ అను!!
చివరి Anonymous.
కీంద పడ్డ పైన ఉన్నాను అంటే ఇలాంటి వాళ్ళు ఏమొ
అదే కొన్ని అణగదొక్కబడిన వర్గాలు ఏ రెజర్వాషన్స్ లేకుండా స్వశక్తి ఇప్పుడు అగ్రవార్ణాలు గా ఎదిగాయి.. కొన్ని వర్గాలు ఇంకా లాగె వున్నాయి.. ఎన్ని యుగాలు గడిచినా అలాగే వుంటాయి.. బుద్ది శక్తి , శరీర శక్తి ఎక్కువ వున్నవాడె ఈ రేస్ లొ విజయం సాదిస్తాడు.. వెనుకబడిన వాళ్ళని , బడుతున్న వాళ్ళని తమతొ పాటు తీసుకు వెళ్ళడానికి , మిగతా వాళ్ళు స్లో అయితే అది గుర్తించనవసరం లేదా ?.. ఇప్పుడు అగ్రవర్ణాలవారిని రేపటికి బలహీన వర్గాలు చేసేసి అప్పుడు కావాలంటె వాళ్ళకి రెజర్వషన్స్ ఇవ్వచ్చు అనే పాలసి ఎమిటొ ..
ఒక చిన్న ఉదాహరణ చూడండి.. ఒకడు ఒక ఉద్యొగానికి వెళ్ళాడు.. వాడికి అన్ని అర్హతలు వున్నాయి.. అయిన కొన్ని రాజకీయాల వల్ల వాడికి ఉద్యొగం రాలేదు.. కొన్నళ్ళకి వాళ్ళ కొడుకొ , మనమడొ అలాంటి వుద్యొగానికె వెళ్ళాడు.. వాడికి ఏ అర్హత లేదు.. కానీ వాళ్ళ నాన్న కి ఉద్యొగం దక్కలేదన్న ఒకే ఒక కారణం తొ అర్హత లేకపొయిన ఉద్యొగం ఇవ్వడం కరక్టా ?
ఇంతకు ముందు అబ్బే ట్రైనింగ్ ఇస్తే ఆ పని ఎవడయినా చెయ్యొచ్చు అని ఎవరో అన్నారు.. ఒకే.. చదువు అలాంటి ట్రైనింగ్ కదా.. ఎలిమెంటరి లొ ట్రైనింగ్ ఇస్తే సరిగ్గ నేర్చుకూకుండా.. నాకు హై స్కూల్ లొ రెజర్వషన్ కావాలి అంటాడు.. అక్కదనుండి .. కాలేజి. డిగ్రీ, ఐ. ఐ. టి లకి కూడా.. అప్పటికి ట్రైనింగ్ అవ్వక ఉద్యొగాల్లొ.. అప్పటికి అవ్వకా ప్రమొషన్స్ లొ .. ఇన్ని అవకాశల్లొ ట్రైనింగ్ ఉపయొగించొలేక , తూటివాడితొ ఎప్పటికి సమానం గా అవ్వలేకపొయాడంతె వాడికి అర్హత లేనట్టె..
హ..హ.. హ.. అప్పుడు మీరు అవకాసాలు రానివ్వలేదు.. ఇప్పుడు మీకు రాకూడదు.. చెల్లు కు చెల్లు అనేది సాడిస్టిక్ ఆనందం .. హక్కులు తొక్కలు .. ఆ సాడిస్టిక్ ఆనందం లొ పార్ట్ .. ఇప్పుడు మంది ఎక్కువ వున్నారు కాబట్టి ఆ హక్కులు.. వొట్ బాంక్ లు..
రాజకీయల్లొ రెజర్వషన్ అంటె అర్ధం వుంది.. డాక్టర్ కి రెజర్వెషన్ అంటె ?
పడమటి దేశాల్లో నల్లోళ్ళని తెల్లోళ్ళు తొక్కేసారు. అమెరికాలో ఘోరాలు అరాచకాలు జరిగాయ్. మరి ఇక్కడ నల్లోళ్ళకి రిజ్రవేషన్స్ ఇచ్చారా? అయ్యో ఆరోజున మిమ్మల్ని మేము దోచుకున్నాం, రండి, మేమి తలకిందులా నిల్చుంటాం కక్కుతాం ఏరుకెళ్ళండి మేము తిన్నది మొత్తం అన్నారా?
ఏవయ్యా కత్తీ ఏమంటావేటి?
రిజర్వేషన్లు వ్యతిరేకించే వారికి ఒకటే ఆలోచన. రిజర్వేషన్లు మీ అవకాశాలకు గండి కొట్టేసాయి అని. మీ సొంత తరం లో మీ మీ అవకాశాలకు భంగం కలిగితేనే ఇంత కష్టం గా ఉంటే, వందల తరాలుగా అవకాశాలే లేని/రాని వర్గాలకు ఇంకెంత కష్టం గా ఉంటుంది ? వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇస్తే గనక మిగత వర్గాలనూ అందుకోగలరు ?
రాజు కొడుకు రాజు, రైతు కొడుకు రైతు, యానాది కొడుకు యానాది గానే బతకాలి అని కోరున్నాయి మన ముందు తరాలు. (కూతురు కూడా, మాట వరస కోసం కొడుకు అని వాడాను) . ఏం యానాది కొడుకు ఎప్పటికి యానాదిగానే ఉండాల్సిందేనా ? ఒక కలెక్టరో, సాఫ్ట్వేర్ ఇంజనీరో కాకూడదా ? అలా కావాలంటే వాళ్ళకి మిగిలిన అగ్ర కులాల పిల్లలతో సమానంగా పోటీ పడేందుకు సహాయం కావాలి.
చదువు పరం గా, ఒక చదువుకున్న(లేదా డబ్బున్న) అగ్ర కులస్తుడి కొడుక్కి దొరికే అవకాశం(వీరికి ఉన్న అవకాశాలే ఒక రిజర్వేషన్ లాంటివి) ఒక చదువే రాని యానాది కొడుక్కి దొరకదు. ఈ అసమానతను రూపు మాపాలంటే, ఆ యానాది కొడుక్కి కొంచెం ఊతమివ్వాలి. అది చేయడానికే రిజర్వేషన్స్ కావాలి. అట్లాగే, చదువు రాని యానాది కుటుంబం ఒకే తరంలో ఐ.ఏ.ఎస్. లను తాయారు చెయ్యలేదు. క్రమంగా జరిగే ప్రక్రియ ఇది. మొదటి తరం లో ఐదవ తరగతి, రెండవతరం లో పది, మూడవ తరం లో కాలేజీ, ఇలా కనీసం కొన్ని తరాలు జరిగే ప్రక్రియ ఇది. అందుకే రిజర్వేషన్లు కూడా కొన్ని తరాల వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఒక చిట్కా - రిజర్వేషన్లు ఉండకూడదు అనుకునే వాళ్ళు చేయాల్సింది ఒక్కటే. సమ సమాజం కోసం మీ వంతూ కృషి చెయ్యండి. ఎంత త్వరగా అది సాకారం అయితే, అంత త్వరగా రిజర్వేషన్లు ఎత్తేస్తారు మరి !
@చివరి అనామకుడు : అసలు అమెరికా పోలిక ఎందుకు వచ్చింది ? మన సమాజానికి అమెరికాకి పోలికే లేదు. మన సమాజం లో ఉన్నన్ని మతాలు, భాషలు, కులాలు, వర్గాలు ఆ దేశం లో లేవు. మన దేశం లో వేల సంవత్సరాల బట్టీ అణచివేత జరిగింది. అమెరికా మొత్తం చరిత్ర కొన్ని వందల ఏళ్ళు మాత్రమే. కాబట్టి అమెరికా తో పోల్చి చేసే వాదన వ్యర్థం !
ఐన నిన్ను నువ్వు తెల్లవాడి లాగా ఉహించుకుంటూ, మిగత వాళ్ళని నల్ల వాళ్ళుగా అనుకుంటున్నావు. తెల్లవాళ్ళు మన దేశం మీద 250 ఏళ్ళు అధికారం చేసాక కూడా, వాళ్లతో పోల్చుకోడానికి సిగ్గుండాలి. ఇంకా సరదాగా ఉంటే ఒక సారి అమెరికా వెళ్లి చూసి రా. ముఖ్యం గా Texas లాంటి southern స్టేట్స్ ki. అప్పుడు తెలుస్తుంది నీకు నల్లోళ్ళ కష్టం గురించి. తెల్లోళ్ళ దాష్టీకం గురించి.
తెలుగోడు సమ సమాజం కోసం మీ వంతూ కృషి చెయ్యండి!!!
సమ సమాజం!!! aMTE emiTi?
@తెలుగోడు
ఉహు.. ఇంకా వేగ్ గానే వుంది మీ వాదన.. ఇక్కడ వాదనతొ మీ అభిప్రాయాలని నేను మార్చలేదు.. నావి మీ మార్చలేరు.. జస్ట్ ఫర్ ద సేక్ అఫ్ అర్గ్యుమెంట్ అంతే..
1. ఈ అసమానతను రూపు మాపాలంటే, ఆ యానాది కొడుక్కి కొంచెం ఊతమివ్వాలి. - కరక్ట్.. అంటే ఎలా ఊతమివ్వాలి.. వాడికి చదువు కొవడానికి దబ్బులేదు కాబట్టి స్కాలర్షిప్ ఇవాలి.. మెంటల్లి ఇంకాంపిటంట్ కాబట్టి అర్హత (ఎకడమికల్లి) లేకపొయినా, చదువుకొవడానికి వున్న కొన్ని అవకాసాల్లొ వాల్లకి రెజర్వషన్ ఇవాలి.. అది 5వ తరగతి లొ వుపయొగించుకున్నాడు.. చదవడానికి డబ్బిచ్చారు.. చెప్పడానికి మాస్టార్లని ఇచ్చారు.. వుండటానికి హాస్టల్స్ ఇచ్చారు. పదవ తరగతి కి వచ్చ్చెసరికి అయినా వాడు ఇంప్రొవ్ అవ్వలా .. (ఇంప్రొవ్ అయ్యిన వాళ్ళ గురించి వదిలేయండి) .. ఇప్పుడు ఇవే అవకాసాలు మళ్ళి 10 లొ, మళ్ళి డిగ్రీ లొ, మళ్ళీ పొస్ట్ గ్రాడ్ లొ.. ఒకే.. అప్పటికి దెవలప్ కాలా.. అంటే మిగతా ఒపన్ కెటగొరి లొ పొటిపడటానికి సరిపొలా.. అయినా పర్లేదు అని ఉద్యొగం ఇవ్వడం సరి కాదని నా అబిప్రాయం.. ఒక వేళ వాడు సరిపొకపొతె మళ్ళి చదువు చెప్పండి.. బెస్ట్ గా ప్రొవ్ చెయ్యమనండి.. అప్పుడు ఇవ్వండి.. ఇన్ని అవకాసాలు ఇచ్చిన ఇంప్రొవ్ అవ్వనోడు.. ఉద్యొగం సరిగ్గా చెస్తాడని ఎల నమ్మ మంటారు (ఇది ఒక ప్రైవట్ పరిశ్రమ ఔనర్ వాళ్ళ కంపెనిలొ రెజర్వెషన్స్ కల్పించలేం అని చెప్పడానికి చెప్పిన కారణం అయినా.. లేక ఒక టేక్స్ పెయర్ గా సాదరణ పౌరుడు అడిగినా..)
2. మీరు ఒక ఉద్యొగం లొ జాయిన్ అయ్యారు.. లేక ఉన్నత చదువులు చదువుకొవడానికి వెరే రాస్ట్రం వెళ్ళారు.. అక్కడ మీరు చెప్పుకుంటెనె కానె మీ కులం తెలీదు.. చెప్పిన అది ఫార్వర్డ్ , లేక బాక్వర్డొ తెలీదు.. కానీ రెజర్వషన్ స్టాంప్ మాత్రం చెబుతుంది.. అంటే రెజర్వెషన్ స్టాంప్ తొ మేము వెనకబడి వున్నాం , మేము వెనకబడి వున్నాం అని చెప్పుకునంతా కాలం ఈ వివక్ష అలాగె వుంటుంది. ( ఇది నా ఐ. ఐ. టి అనుభవం)
3. సమ సమాజం కోసం మీ వంతూ కృషి చెయ్యండి... మీరు చెప్పిన సమ సమాజం ని ఎప్పటికి క్వంటిఫి చెయ్యలేరు.. క్వంటిఫి చెయ్యంత కాలం సమ సమాజం వచ్చిందని ఎప్పటికి ఒప్పుకోరు.. మొన్నీ మద్య కత్తి గారు ఎదొ విషయం లొ నీకు ఫ్రీ గా ఒక లక్ష ఇస్తానతె నువ్వు వదులుకుంటావా అని.. అది కరక్ట్ .. ఎవరు ఒప్పుకోరు.. ఎప్పుడు ఈ రెజర్వషన్స్ కి అంతం అంటె.. కొన్ని తరాలకి ఇప్పుడు వున్న అగ్రవర్ణాలు వెనుకబడిన వర్గాలుగా మారి వాళ్ళు మాకు రెజర్వషన్స్ కావాలని పొరాడినప్పుడు.. అలా ఎందుకు జరుగుతుంది అంటారా.. ఈ మేత్ చుడంది..
తరం 1: 100% - అగ్రవర్ణాల అవకాసాలు 0% - వెనుకబడిన వర్గాల అవకాసాలు.
తరం 2: 50% - అగ్రవర్ణాల అవకాసాలు 50% - వెనుకబడిన వర్గాల అవకాసాలు.
తరం 3: 25% - అగ్రవర్ణాల అవకాసాలు 25% - వెనుకబడిన వర్గాల అవకాసాలు ఒపెన్ కటగొరి లొ 50% - వెనుకబడిన వర్గాల అవకాసాలు రెజర్వెషన్స్ లొ . (25% వెనుక బడిన వర్గాలు అప్పటికి డెవలప్ అయ్యిన వాళ్ళు)
తరం 4: 12.5% అగ్రవర్ణాల అవకాసాలు 37.5% - వెనుకబడిన వర్గాల అవకాసాలు ఒపెన్ కటగొరి లొ 50% - వెనుకబడిన వర్గాల అవకాసాలు రెజర్వెషన్స్ లొ . (37.5% వెనుక బడిన వర్గాలు అప్పటికి డెవలప్ అయ్యిన వాళ్ళు)
సొ ఒన్.. ఇక్కడ 4 తరాలు ఉదాహరణకి.. ఇవి 40 తరాలు కావచ్చు..
4. నాకు మా కంపని సి. యి. వొ. అవ్వాలని వుంది.. నాకు అర్హత వుంటె ఎప్పటికయినా అవుతాను.. లేదు అర్హత లేదు కానీ మా కుటుంబం లొ ఇప్పటివరకు ఎవరూ సి. యి. వొ. అవలేదు కాబట్టి నాకు ఇవ్వండి అంటే.. మీరనవచ్చు.. సి. యి. వొ. కి మామూలు ఉద్యొగాని సంబందం వుందా అని.. కొన్ని మరీ పెద్ద పొస్ట్లు అని.. అదె విషయం.. ఒకే.. మనకంటూ కొన్ని ప్రిమేయర్ ఇన్స్టిట్యూట్ వున్నాయి.. దాని గ్రాడ్ అంటె ఒక స్టాంప్ (స్స్వదెశం మరియు విదెశాల్లొ ) ఆ స్టాండర్డ్ ని తూట్లు పొడుస్తూ దానిలొ కూడా రెజర్వెషన్స్.. ఒకే దాంట్లొ చదువుకొవడానికి అర్హత వచ్చింది అనుకుంటే.. అక్కద నేర్చుకున్నది లేదు.. దాంట్లొ చదివినా మళ్ళి బయట వుద్యొగానికి కావాలి రెజర్వెషన్స్..
5. రెజర్వెషన్స్ వ్యతిరెకించెవాళ్ళు అందరు వెనుకబడిన వర్గాలని వ్యతిరెకించెవాళ్ళు కాదు అన్న నమ్మకం మీకు వచ్చెవరకు ఎన్ని శతబ్దాలు గడిచినా పరిస్తితి మారదు.
ఒకే.. ఇక్కడితొ నేను విరమిస్తున్నా.. as said in starting I can't change your mindset and you can't change mine.. I am not going to respond..
I am the Anonymous who wrote this "అదే కొన్ని అణగదొక్కబడిన వర్గాలు ఏ రెజర్వాషన్స్ లేకుండా స్వశక్తి ఇప్పుడు అగ్రవార్ణాలు గా ఎదిగాయి......"
Sorry for the spelling mistakes..:-)
@ తెలుగోడు
అమెరికా లొ మనదెశం లొ వున్నంత అణిచివేత లేదన్నారు.. మళ్ళి సౌత్ లొ నీకు నల్లోళ్ళ కష్టం గురించి. తెల్లోళ్ళ దాష్టీకం గురించి అంటున్నారు.:-)
@ అనానిమస్సు -
అమెరికా లొ కూడా రెజర్వెషన్స్ వున్నాయి .. అవి నళ్ళ వాళ్ళకు కాదు.. నేటివ్ అమెరికన్స్ కి .. కాకపొతె అవి ఉపయొగించడాని వాళ్ళు మిగిలి లేరు.. ఆ రెజర్వషన్స్ కి కూడ కొన్ని ఉద్యొగాలకి .. అంతే కానీ నేటివ్ అమెరికన్ అని నాసా లొ జాబ్ ఇచ్చి అంతరిక్షం లోకి పంపరు.
ఇక పోతె.. నల్ల వాళ్ళకి , మహిళలకు ఒక హిడన్ రెజర్వషన్ వుంటుంది .. అది ఎందుకంటే.. వీళ్ళు ఉద్యొగ అవకాసాలు అందరికి సమానం అని ప్రబుత్వానికి నిరూపించుకొవాలి.. ఎంత ఒపన్ గా వున్నా. కొన్నళ్ళకి ఒక ఆఫీసులో అంతా తెల్లవాళ్ళొ లేక అంతా మగ వాళ్ళె వున్నరనుకోండి , వాళ్ళు కావాలని చెయ్యక పొయినా బయట వారికి అనుమానం వస్తుంది. అందుకు మల్లి వినరణ ఇచ్చుకొవాలి. అందుకు వీళ్ళు ఎం చెస్తరంటె ఒక నల్లవాడు, ఒక తెల్లవాడు ఇంచుమించు ఒకే అర్హతలు కలిగి ఉంటే వీళ్ళు నల్లొడిని తీసుకుంటారు.. అప్పటికే ఆ ఆఫీసులొ కావలసినత మంది నల్లవాళ్ళు వుంటె అప్పుడు మరింత గ్రిల్ చేసి బెస్ట్ పర్సన్ ని తీస్తారు. ఇవి రూల్స్ కాదు కాని జెనెరల్ గా ఎక్కువ మంది పాటించేవి..
రెజర్వషన్స్ అన్నది వుండాలి.. కానీ దాన్ని వొట్ బాంక్ కి మార్చి రాజకీయాలు చెసెవారిని తన్నాలి.. రాజకీయాల్లొ వుండాలి ..అందరికి అదికారం రావాలి. మీడియా వుండాలి - వాళ్ళ గొంతు వినిపించడానికి.. చదువు లొ వుండాలి - డబ్బు లేకపొవదం లేక వళ్ళ అవకాశం కొల్పొకూడదు. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ వుండాలి.. ఉదా : డాక్టర్స్, ఇంజినీర్స్, సైంటిస్ట్ - ప్రత్యేక స్కిల్స్స్ కావల్సిన ఉద్యొగాలో కరక్ట్ పర్సన్స్ వుండాలి .. అది నా అభిప్రాయం ..
అసలు నా బాద అంతా
ఏన్ని అవాకాశాలు, సదుపాయలు అందిస్తు
మేట్టమేదట మేదట మేదట మేదట
ఈ అమేదట అనే ప్రటి చోట వీళ్ళకి అవకాశం కల్పిస్తున్నా మాకు ఏమి చేయలేదు మమల్ని కీంచ పరుస్తున్నారు అవమనిస్తున్నారు అనే వీళ్ళ ఏద్దెవ కడుపు మండుతోంది
వీళ్ళని మీంచిన స్వార్ధపరులు ఏవరు లేరు
అంతా మనం ఇచ్చిన అలుసే
ఏ జాతి వీళ్ళ అణదొకుతోంది అని వీళ్ళు చేపుతున్నారో
అదే జాతి వీళ్ళని నేట్టిన పేట్టుకుంటున్న సంగటి ఏప్పుడు తేలుసుకుంటారు.
అన్ని అర్హతలు ఉన్న కేవలం ఈ రిజర్వశన్ ల ములంగా ఏంత మంది మా లాంటి యువత నష్టపోతున్నారో ఏవరు సమాధానం చేబుతారు.
మళ్ళి తోక్కలో హీందుమతం మీద ఏడుపులు..సేటైర్లు
చా
@మంచు పల్లకీ : మీ అభిప్రాయం మార్చాలని నా ఉద్దేశం కాదు. నా అభిప్రాయం వెనక ఉన్న కారణం అర్ధవంతంగా చెప్పాలనేదే ఉద్దేశం. ఆ పనిలో మీ అభిప్రాయం ప్రభావితమితే మంచిదే !
1. ఇక్కడ అవకాశాలు అంటే, కేవలం డబ్బూ, బడి, అయ్యవార్లు మాత్రమే కాదు. అగ్రవర్గాల తల్లిదండ్రులు ఉన్న ఇంట్లో ఎటువంటి అవకాశాలు ఉంటాయంటే - వారి పిల్లల చదువు గురించి ఉన్న శ్రద్ధాసామర్ధ్యాలు, చదువును ప్రోత్సహించే వాతావరణం, చదువు వల్ల ఒనగూరే లాభాలు తెలియజెప్పడం, సరైన వనరులు సమకూర్చడం. ఇలాంటివన్నీ కూడాను పోటీ పడటానికి ఎంతో అవసరం. కానీ ఈ అవకాశాలు ఏవీ కూడా ఎక్కువ మంది(కొంత మందికి ఉండచ్చు, మంచిదే ) నిమ్న వర్గాల పిల్లలకు అందుబాటులో ఉండవు. ఈ అవకాశాలను ప్రభుత్వం కూడా ప్రత్యక్షంగా సృష్టించలేదు. నిమ్న వర్గాల సాంఘిక జీవన స్థాయిని క్రమంగా పెంచడం ద్వారానే ఇది సాధ్యం అవుతుంది. రిజర్వేషన్స్ యొక్క మూల ఉద్దేశం కూడా ఇదే.
మనం ఒక 'వ్యక్తి' గురించి చూడడం సరి కాదు. నిమ్న వర్గాలనూ ఒక సమూహం గా చూడాలి ఇక్కడ. ప్రపంచం లోని ఏ సమూహం యొక్క మొత్తం తెలివి(జ్ఞానం కాదు) మిగిలిన ఏ ఇతర సమూహం తో సమానంగానే ఉంటుంది. "The collective intelligence of any community will be equal to the collective intelligence of any other community" (Not sure who said this).
2. మీరు IIT అని చెప్పాక మీ మీద ఇంకా గౌరవం, ఆసక్తి పెరిగాయి. ఎంతో కష్టపడి సాధించి ఉంటారు. మీరు పడ్డ కష్టాన్ని ఒక్కటే చూడద్దు. మీకు తెలియకుండానే, మీరు చిన్నప్పటి నుండి కుటుంబపరం గా పొందిన అవకాశాలను, ప్రోత్సాహాన్ని, వనరులనూ కూడా కలిపి చూడండి. అప్పుడు బహుశా మీకు అర్థం అవుతుంది, నిమ్న వర్గాల వారు ఏమి కొల్పోతారో.
3. ఆదర్శ సమ సమాజం ఎప్పటికి సాధ్యం కాకపోవచ్చు. కాని మనం అదే దారిలో వెళ్ళాలి. ఒక 200 ఏండ్ల కిందటి కంటే ఇప్పుడు మనం సాంఘికం గా అభివృద్ధి చెందామని నేను అనుకుంటాను. కాని ఈ దారిలో ఇంకా వేగంగా వెళ్ళినప్పుడు గమ్యానికి దగ్గరగా అయినా చేరుకోగలం, అది చాలు.
ఉదాహరణ కి, Science & Technology ని తీసుకోండి. క్రీ.శ. 1వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు జరిగిన అభివృద్ధి కంటే కూడాను, ఒక్క 20వ శతాబ్దం లోనే ఎన్నో రెట్లు అభివృద్ధి జరిగింది. సాంఘిక రంగం లో కూడా ఇలాటి దృశ్యమే ఆవిష్కృతం కావాలి.
4. మీరు చెప్పిన ఉదాహరణ నే తీసుకుందాము. మీకు c.e.o. కావాలని ఉంటె తప్పకుండ మీకు అర్హత ఉండాలి. కాని, ఆ అర్హత/అనుభవము సాధించగలిగే, సంపాదించగలిగే అవకాశాలు కూడా అందరికి(ఆ కంపెనీ లో పనిచేసే అందరికి) సమానం గా ఇవ్వబడాలి. లేదంటే మీరు ఎప్పటికి c.e.o. కాలేరు. సమాజం కూడా అంతే, అందరికి ఎదిగేందుకు అవసరమైన అర్హత సాధించే సమాన అవకాశాలను కల్పించాలి.
5." రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళు అందరూ కూడా, వెనుకబడ్డ వర్గాలని వ్యతిరేకించే వాళ్ళే" అనే దురభిప్రాయం నాకు లేదు.
మీ ప్రతి జవాబు కోసం ఎదురు చూస్తాను.
@మంచుపల్లకి : "అమెరికా లొ మనదెశం లొ వున్నంత అణిచివేత లేదన్నారు." - అని నేను అనలేదు. అమెరికా సమాజానికీ, మన సమాజానికి పోలిక లేదు అన్నాను. తెల్లవాళ్ళు మనమీద ఎంతో అరాచకం చేసాక కూడా, వాళ్ళతో పోలికలేంది అన్నాను. తెల్లవాళ్ళ దాష్టీకం గురించి అనుభవం లేకపోతే, ఇప్పటికి కూడా ప్రత్యక్షంగా ఆయా ప్రాంతాల్లో చూడొచ్చు అని చెప్పాను.
1. నేను రిజర్వెషన్స్ (కొన్ని రంగాల్లొ, కొన్ని వుద్యొగాలకి) వ్యతిరేకించడానికి కొన్ని కారణాలు
1.1. ఆందరూ గెలిచేలా చూడటమనేది, వింటానికి బాగుంటుంది కానీ అది సమాజానికి మంచి చెయ్యదు. అంటే వెనకబడిన వాడిని అలా వదిలెయ్యమని కాదు. రేస్ లొ వెనకబడిన వాడిని ఇంకా వేగం గా పరిగెత్తించాలంటె , వాడికి బూస్ట్ ఇవ్వడం సరైనదే ..కానీ బాగా పరిగెత్తెవాడిని వెనుకున్న మిగతా వాళ్ళకొసం నెమ్మది గా పరిగెత్తమనడం సరి అయినది కాదు. కానీ ఇక్కడ జరుగుతుంది అదే..
ఉదా : ఒక కాలేజ్ వుంది .. దాంట్లొ వెనుకనడిన వాళ్ళకి బూస్ట్ ఇవ్వడానికి 50% రిజర్వ్ చెసారు. ఇంకొ కాలేజ్ వుంది దాంట్లొ అందరికి సమాన అవకాసాలు ఇచ్చారు. సాధారణం గా 'సమాన అవకాసలు ఇచ్చిన కాలేజ్ ' కి రేస్ లొ ముందు వున్నవాల్లు పొటి పడతారు. (రేస్ లొ ముందు వున్నవాళ్ళని నేను కుల మత ప్రతిపాదికిన విభజించడం లేదు - కేవలం జీవితం అనే రేస్ కి మాత్రమె పరిమితం చేస్తున్నా). ఇప్పుడు సమాన అవకాసాలు వున్న కాలేజ్ లొ కూడ 50% రెజర్వ్ చేస్తె అప్పుడు రేస్ లొ ముందు వున్నవాళ్ళని లిమిట్ చెస్తున్నట్టు). ఇది రెండు రకాలుగా చెడు చేస్తుంది.
అ) బాగా పరిగెత్తె వాడికి ఇంక పరిగెత్తాలన్న మొటివెషన్ వుండదు..
ఆ) వెనుకబడిన వాడికి పరిగెత్తక పొయినా ఫైనల్ ప్లేస్ లొ స్తానం వుంటుందన్న ధీమా తొ ఇంకా బాగా పరిగెత్తాలన్న మొటివెషన్ వుండదు.
ఇ) ఫైనల్ గా మన దేశం లొ పరిగెత్తే వాళ్ళ స్టాండర్డ్ తగ్గిపొతుంది. లేకపొతే బాగా పరిగెత్తె వాళ్ళు వెరే దేశం పొతారు ..
1.2. నేను ముందు చెప్పినట్టు సమ సమాజాన్ని ఎవరూ ఇప్పటివరకు క్వాంటిఫై చెయ్యలేదు. సొ దీనికి అంతం లేదు. కొన్నాళ్ళు రిజర్వెషన్స్ అన్నది తప్పు. రిజర్వెషన్స్ మొదలయ్యాయి అంతే.. రాజస్తాన్ లొ గుజ్జార్ ల పొరాటం ఫ్యూచర్ లొ రిజర్వెషన్స్ ఎలాంటి మార్పు తెస్తుందొ తెలియపరుస్తుంది. రిజర్వెషన్స్ వల్ల వున్న అవకాసాలు అందరు గుర్తించడం మొదలు పెట్టాక ప్రతివాళ్ళు తమ కులాన్ని దాంట్లొ చేర్చాలని పొరాటం మొదలు పెడతారు. బి.సి లొ వున్నవాళ్ళు ఎస్. సి. కి , ఎస్. సి. లొ వాళ్ళు ఎస్. టి . కి , ఎఫ్. సి. లొ వున్నవాళ్ళు బి. సి. కి మారాలని పొరాటాలు మొదలు పెడతారు. ప్రస్తుతం ఇవి శాంతియుత పొరాటాలు. కానీ ఇవి హింసాయుతమవ్వడానికి ఒక తిక్క నాయకుడు చాలు. బహుశా అదె అంతం అనుకుంటా.. అన్ని కులాలు స్లొ గా కొటాలొ బాగం తీసుకుంతె ఇంక ఒపన్ కి , కొటాకి తేడా వుండదు. (ఇది మన రిజర్వెషన్స్ ఆబ్జెక్టివ్ కి రివెర్స్.. అప్పట్లొ ఒక్కొ డెవెలప్ అయిన కులాన్ని కొటాలొనుండి తీసెయిచ్చు అనుకుని వుంటారు.. కానీ జరుగుతున్నది ఒక్కొ కులాన్ని కొటాలొకి చెరుస్తున్నారు :-) )
1.3 ఇక మత ప్రతిపదికిన రెజర్వెషన్స్ గురించి చెప్పకర్లేదు. మన వొట్ బాంక్ రాజకీయాలు తెలుసుగా..
2. నిమ్న వర్గాల లొ మన ప్రవీణ్ కి వుండే దైర్యం కల్పించాలి. నేను నా కాళ్ళమీద నిలబడగలను అన్న దైర్యం కల్పించాలి. అంతే కానీ ఫ్రీ గా వచ్చె లక్ష నేనెందుకు వదులు కుంటాను అన్న కాన్సెప్ట్ చాలా డేంజర్. అంటే ఒక్కసారి ఒక గౌరవ ప్రదమయిన వుద్యొగం వచ్చాక, ఆ లేవెల్ అంతకన్న తక్కువ లెవెల్ ఉద్యొగాలకి ఆ కుటుంబానికి రెజర్వషన్స్ వుండకూడదు. ఉదా.. ఒక తరానికి లెవెల్ 4 వుద్యొగం వచ్చింది అనుకొండి (లెవెల్ 1 ఇస్ బీయింగ్ హైయస్ట్ , లెవెల్ 7 ఇస్ లీస్ట్ ) , వాడి కుటుంబంలొ తరువాతి తరానికి రిజర్వెషన్ లెవెల్ 1-3 మాత్రమె వుండాలి. లెవెల్ 4-7 రిజర్వెషన్స్ వుండకూడదు. అలాగే చదువులొ కూడా..అప్పుడు తరువాతి తరానికి తన తండ్రి కన్న పైకి వెల్లే చాన్స్ మాత్రమె వుంది అన్న విష్యం అర్దం అవుతుంది. అలాగె వాడు అల్రేడి వాళ్ళ తండ్రి లెవెల్ సమాజం లొ లెవెల్ 4 అని అర్దం అవుతుంది. ఇవి ఆచరణ పెట్టడానికి చాలా కస్టం కాదు. కొద్ది కస్టం అంతే..
3. అలాగే ఒక వెనుక బడిన వర్గం నుండి మంచి పొజిషన్ కి వచ్చిన వాడికి , తన తొటి వాళ్ళను పైకి తీసుకు రావడానికి మిగతా వాళ్ళకన్న ఎక్కువ రెస్పాన్స్బిలిటి వుండాలి. మీరన్నారు .." ఇప్పుడు అవాకాసాలు పొతున్నాయని మీరు బాదపడుతున్నారు గత వందల సంవత్సరాలుగా అవాకాసాలు పొగొట్టుకున్న మేమెలా వుండాలి అని. ". అలాగే ఇంకొన్ని కామెంట్స్ ..ఇవి వున్న అగాధాలని పెంచడానికె తప్పించి అలొజింప చేసెలా ఉపయొగ పడవు. ఇప్పుడు అవకాసం పొగొట్టుకున్నవాడు , నా ముత్తాతలు చేసిన తప్పుకి మాకెందుకు శిక్ష అనుకుంటాడు. మా నాన్నగారు 30 క్రితం అవకాసం పొగొట్టుకున్నదుకు వచ్చిన బాద కన్నా ఇప్పుడు నేను అవకాసం పొగొట్టుకున్నదుకు వచ్చిన బాద, కొపం హాట్ గా వుంటుంది. ఆ హాట్ లొ వున్నవాళ్ళని ఇంక రెచ్చగొట్టె వ్యాక్యలు చేయడం ద్వారా మరింత అగాదం ఎర్పడుతుందని నా అభిప్రాయం. అది మనస్సుకు ఒకరకమయిన సంత్రుప్తి కల్గించొచ్చు ..కానీ అది కరక్ట్ కాదు. అంటే..వాళ్ళు ఎదయిన కామెంట్స్ చెయ్యొచ్చు మేము మాట్లాడ కూడదా అంటే .. నేను ఎమి చెప్పలేను..
4. Science & Technology విషయం మళ్ళ ఎప్పుడయిన సెపెరట్ గా డిస్కస్ చెద్దాం.. నేను 18వ, 19వ శతాబ్దం కూడా చాలా ఇంపొర్టంట్ అనుకుంటాను.. ఉదా: మొదటిసారి ఒక ఎలెక్ట్రిక్ మోటార్ కనిపెట్టడం కస్టం.. కానీ ఒక్కసారి కనిపెట్టాక దానిని హెయిర్ డ్రైయర్ నుండి ట్రైన్ ఇంజిన్ వరకు వుపయొగించుదొవడం సులువు . (కంపేర్ చెస్తే) .. అలాగే ఎలెక్ట్రిక్ బల్బు కనిపెట్టదానికి ఎడిసన్ ఎన్నొ వందల కాంబినెషన్స్ ట్రై చెసాడట.. ఇప్పుడయితే నేను కంప్యుటర్ సిములషన్స్ చెస్తా.. సింపల్ గా చెప్పలంటే.. 19 వ శతాబ్దం లొ 10 ని 100 గా డెవలప్ చెస్తే 20 శతాబ్దం లొ ఆ వందనికి 900 చెసారు. డైరెక్ట్ గా చూస్తే 19 వ శతాబ్దం లొ 90 కొత్త విషయాలు కనిపెడితే 20 వ శతాబ్దం లొ 800 కనిపెట్టారు. ఇంకొరకం గా చుస్తే 19 వ శతాబ్దం లొ 10 రెట్లు గ్రొత్ వుంటే , 20 వ శతాబ్దం లొ 9 రెట్లు వుంది.
< ఇది టాపిక్ కి సంబందం లేదు.. ఎదొ సరదా పుట్టి రాసింది. )
దేశ సామాజిక చరిత్ర తెలియకుండా వర్తమానం నుంచీ (లేదా స్వీయానుభవాలనుంచీ) చూసి అభిప్రాయాలు ఏర్పరుచుకునే అర్బన్ ఎలీట్ రిజర్వేషన్ వ్యతిరేక వాదనలు ఇలాగే ఉంటాయి. ఇవి కొత్తాకాదు, సమాజం చేత ఆమోదించబడేవీ కాదు.చర్చించడానికీ లేదా ఏదైనా వక్తృత్వపోటీల్లో మాట్లాడటానికీ మాత్రమే పనికొస్తాయి.
కత్తి జీ-
మీతొ చర్చించడానికి ఖచ్చితంగా ఉపయొగపడవని నాకు తెలుసు. Take it easy.
సమాజ పరిస్థితి ని ఒక రేస్ తో పోల్చారు. అది సరైన పోలికే కాదు. సమాజం అంటే అన్ని వర్గాలు ఒక దానితో ఒకటి Compete చేసుకోవడం కాదు. సమాజం అంటే అన్ని వర్గాలు ఒక దానిని ఒకటి Complement చేసుకోవడం.
గమనిక - నా పోలికలు పూర్తిగా వర్గాలకు సంబంధించినవి. వ్యక్తులకు కాదు.
1. సరే పోనీ, మీ ఉదాహరణనే తీస్కుందాము. మీ దృష్టి లో కొన్ని వర్గాలు బాగా పరిగెత్తాయి, కొన్ని వర్గాలు మెల్లగా పరిగిస్తున్నాయి. ఇక్కడ మీరు convenient గా మర్చిపోయిన విషయం ఏందంటే, 'బాగా పరిగెత్తేవాళ్ళు' రేస్ మొదట్లో 'బాగా పరిగెట్టని వాళ్ళ' ను ట్రాక్ అవతలికి నేట్టేసారు, వారికి రేస్ పాల్గొనే వనరులు లేకుండా చేసారు. 'బాగా పరిగెత్తేవాళ్ళు' అలా అన్యాయమైన head-start కొట్టేసారు. దీన్నే Foul-Start అంటారు. ఆ తర్వాత వాళ్ళని వెనక్కి పిలిచి సమానంగా ఎలా స్టార్ట్ చేయిస్తారో మీరు టి.వి. లలో చూసే ఉంటారు.
అ) @"బాగా పరిగెత్తె వాడికి ఇంక పరిగెత్తాలన్న మొటివెషన్ వుండదు.".- ఇప్పుడే చెప్పాను Foul-Start గురించి.
ఆ) @"వెనుకబడిన వాడికి పరిగెత్తక పొయినా ఫైనల్ ప్లేస్ లొ స్తానం వుంటుందన్న ధీమా తొ ఇంకా బాగా పరిగెత్తాలన్న మొటివెషన్ వుండదు." - (అన్యాయమైన రూల్స్ తో) వెనకబడ్డ వాడికి కావాల్సింది మోటివేషన్ కాదు. న్యాయమైన రూల్స్ కావాలి. రేస్ తిరిగి స్టార్ట్ చెయ్యలేరు అంటే గనక, ముందుగా పరిగెత్తే వాడి పక్కన చోటిచ్చి పరిగెట్టించాలి.
ఇ) @"ఫైనల్ గా మన దేశం లొ పరిగెత్తే వాళ్ళ స్టాండర్డ్ తగ్గిపొతుంది. లేకపొతే బాగా పరిగెత్తె వాళ్ళు వెరే దేశం పొతారు ." - హు, దేశం-స్టాండర్డ్స్. ఈ పదాల మీద ఉన్న శ్రద్ధ మనకి జనాల మీద ఉంది ఉంటె , ఎప్పుడో బాగుపడేది ఈ సమాజం. రెండవది, రేస్ లో 'ముందు ఉన్నాము అనుకొనేవాళ్ళు' వేరే దేశం పోయినా నష్టం లేదు. ఎందుకంటే వారు రేస్ లో ముందుకు వెళ్ళింది Unfair Advantage వల్ల మాత్రమే.
1.2. ఉదాహరణకు, 'ప్రేమ' ను కూడా ఎవరూ quantify చెయ్యలేరు. కాని అందరికి అనుభవమే. సమ సమాజం కూడా అంతే, ఎవ్వరు quantify చెయ్యక్ఖర్లేదు. కాని అందరికి( అం ద రి కీ) అనుభవం అయ్యినప్పుడే అది సాధ్యం .
అయిన రిజర్వేషన్ వచ్చి దశాబ్దాలు అయినా కూడా, ఎక్కడ కూడా రిజర్వేషన్ గురించి విపరీతమైన పోరాటాలూ ఏమి జరగలేదు. వెనకబడ్డ వర్గాల వారికి, కూడు-గుడ్డ-ఆరోగ్యం-పని వంటి Basic Necessities కే దిక్కు లేదు ఎన్ని పోరాటాలూ చేసినా కూడా ఇంకా. ఇంకా రిజర్వేషన్స్-పోరాటాలు కూడానా ? Future లో రిజర్వేషన్స్ కోసం ఇన్ని పోరాటాలు జరుగుతాయి అని ఊహించి చెప్తున్నారా ? రిజర్వేషన్-వ్యతిరేక పోరాటాల గురించి మీరు మళ్ళీ convinient గా మర్చిపోయినట్టున్నారు ! అయిన మీకు 'తిక్క నాయకు' ల మీద వ్యతిరేకత ఉంటె, దానికి రిజర్వేషన్ లకు సంబంధమేంది ?
1.3. వోట్ బ్యాంకు రాజకీయాలు ఎప్పుడు ఉండేవే, ఒక్క రిజర్వేషన్స్ విషయంలో మాత్రమే కాదు.
2. @"నిమ్న వర్గాల లొ మన ప్రవీణ్ కి వుండే దైర్యం కల్పించాలి" - అయ్యా , నిమ్న వర్గాలకి ధైర్యం లేదని మీరు ఎట్లా వాక్రుచ్చారు ? మిగత వర్గాల్లో ఎంత భయము/ధైర్యము/స్థైర్యము ఉన్నయ్యో, నిమ్న వర్గాల్లో కూడా అంతే పాళ్ళలో ఉన్నాయి. లేనివి కేవలం వనరులు మాత్రమే.
"రిజర్వేషన్స్ వల్ల ఏదో అన్యాయం జరిగిపోతోంది" అని నమ్మే వారికి కల్పించండి ధైర్యం, అలాంటిదేమీ లేదు అని చెప్పి.
మీ సూచన బాగుంది. కాని సమాజం లో level అంటే ఉద్యోగం ఒక్కటే కాదు.
3. Responsibility అందరికి సమానమే. నిమ్న వర్గాల వారు వేరే, ఇతరులు వేరే వేరే అనుకోవద్దు. అందరు కూడా మన తోటి వారే. కాబట్టి నిమ్న వర్గాల వారిని పైకి తీస్కోచ్చే బాధ్యత కూడా అందరికి సమానమే.
అవకాశాలు అనేవి విడిగా, కేవలం వర్తమానం లోంచే చూస్తె ఎలాగా ? మనం ఇప్పుడున్న 'స్థితి'(సామాజిక/ ఆర్ధిక/కుటుంబ/విద్య/ ఉద్యోగ/ఇతర)మన తాతలు ముత్తాతల నుంచే మనకు సంక్రమించింది. ఈ అర్హత/వనరు లను మాత్రం పుచ్చుకొని అవకాశాల విషయం లో మాత్రం నాకేమి సంబంధం లేదు అని ఎలా అంటాము. అవకాశాలను, అర్హత/వనరులను వేరు చేసి చూడలేము. ఇది అర్థం చేస్కుంటే, ఊరికే రెచ్చిపోరు. ఒక వేళ రెచ్చిపోవాల్సిందే అనుకుంటే, తాత ముత్తాతతల నుంచి వచ్చిన 'స్థితి' కూడా పూర్తిగా త్యజించి రమ్మనమని చెప్పండి.
అయినా , రిజర్వేషన్స్ అంటే ఇతర వర్గాల అవకాశాలను లాక్కోవడం కాదు. న్యాయమైన వాటా సాధించుకోవడం. అది అర్థం చేస్కుంటే ఏ రెచ్చిపోవడాలు ఉండవు.
4. @ : "Science & Technology విషయం మళ్ళ ఎప్పుడయిన సెపెరట్ గా డిస్కస్ చెద్దాం" - అట్టే, మీరెప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ, ఎందరంటే అందరం ! మాట్లాడేస్కుందాము.
ఊహించా మీరు Foul-Start అంటారని.
@@ రేస్ తిరిగి స్టార్ట్ చెయ్యలేరు అంటే గనక, ముందుగా పరిగెత్తే వాడి పక్కన చోటిచ్చి పరిగెట్టించాలి - కరక్ట్.. కానీ ఇక్కడ జరుగుతున్నది పక్కన చొటు ఇవ్వడం కాదు.. బాగా పరిగెత్తే వాడిని పొటీనుండి తరిమెయ్యడం.. Foul-Start కి దీనికి సాంకెతికంగా ఎమి తేడా లేదు.
@@ మీరు convenient గా మర్చిపోయిన విషయం ఇంకొటి ఎమిటంటే.. అదే Foul-Start తొ పరిగెట్టి ఈ రోజు ఆ Foul-Start కి కారణం అయ్యిన వారికన్న ముందు వున్న వర్గాలు మర్చిపొయారు. ఉదా.. కాపులు , బలిజ , కమ్మ, వగైరా..
@@ దేశం-స్టాండర్డ్స్ మీకు నమ్మకం లేదని నాకు తెలీదు
@@ "'ముందు ఉన్నాము అనుకొనేవాళ్ళు' వేరే దేశం పోయినా నష్టం లేదు "..అనుకునే వాళ్ళు పొయిన పర్లేదు కానీ నిజంగా ముందు ఉండే వాళ్ళు పొతే నస్టమే.. మీరు ఏ ప్రాతిపదికన బాగా పరిగెత్తె వాళ్ళు పొతే దేశానికి నస్టం లేదు అనుకుంటున్నరొ నాకు తెలీదు. వాళ్ళు దెశద్రొహులు కాదు - తెలివయిన వాళ్ళు అయినా దేశానికి అక్కర్లేదు అని డిసైడ్ చెయ్యడానికి.
@@ 'ప్రేమ' ను కూడా ఎవరూ quantify చెయ్యలేరు ..Correct...అందుకే ఎంత దక్కినా ఇంకా కావాలనిపిస్తుంది. రెజర్వెషన్స్ కూడా అంతే ఎంత దక్కినా ఇంకా కావాలనిపిస్తుంది .మీ ఉద్దేస్యం లో ఈ ప్రపంచం లొ ఎ దెశం లొ సమ సమాజం అం ద రి కీ అనుభవం అయ్యివుంది. మరెక్కడా ఈ రిజర్వేషన్ లెవే.. వున్న రిజర్వేషన్ అన్నీ లిమిటడ్.
@@ Future లో రిజర్వేషన్స్ కోసం ఇన్ని పోరాటాలు జరుగుతాయి -- అన్నది నా ఉహ మాత్రమే .. ఇంకా చెప్పలంటే అలా జరగాలని కోరుకుంటున్నా ( ఫర్ సం రీజన్) - ఈ విషయం లొ నేను ఇంకేమి చర్చించను.
@@ 'వాక్రుచ్చారు' అంటే అర్దం తెలీదు కానీ - నేను ఎమి అనుకుటున్ననొ చెబుతున్నా. ఆ దైర్యం వుంది అనడానికి ప్రవీణ్ యే సాక్ష్యం ..
అక్కడ నేను చెప్పలనుకున్నది .. 50% రిజర్వెషన్స్ లొ అందరికీ అవకాశాలు దక్కవు . నిమ్న వర్గాలనుండి వచ్చిన వాడు ఒకడు మంచి పొజిషన్ కి వెలితే , వాడు 'ఇంక నాకు రిజర్వెషన్ అక్కర్లేదు అని అవకాశాలు దక్కని మిగతా నిమ్న వర్గాల వాళ్ళకి అవకాశాలు వచ్చెలా చూడాలి అంటున్నా..
ప్రవీణ్ ఒక పెద్ద మనిషి తొ అన్నాడు .. " నేను ఈ రొజు మంచి పొజిషన్ లొ వున్నాను ..నాకు రిజర్వెషన్ అక్కర్లేదు.. నా ప్లేస్ లొ ఇంకొ వెనుకబడిన వాడికి అవకాశం ఇవ్వాలి .. అలాగే నువ్వు ఇప్పుడు మంచి పొజిషన్ లొ వున్నావూ .. నువ్వు అలాగె చెయ్యి " అని.. దానికి ఆ పెద్ద మనిషి " ఫ్రీ ఒక లక్ష ఇస్తానంటే వదులుకొవడానికి నాకెమయిన పిచ్చా" అని.. ఆ రెండు కరెక్టర్స్ గురించి చెప్పే ప్రయత్నం చెసాను. తెడా మీకు అర్దం అవుతుంది.
@@ Responsibility అందరికి సమానమే.. ఇది నేను ఒప్పుకొనండి.. మీ కుటుంబం లొ వారి గురించి మీకు ముందు శ్రద్ద వుండాలి ..మిగతా వాళ్ళ దగ్గరనుండి ఎక్స్పెక్ట్ చెసేముందు. పైన చెప్పిన ఉదాహరణ తీసుకొండి. సాటి వర్గ వ్యక్తి కొసం తన ఫెసిలిటి వదులుకొలేని వ్యకి , పక్కొడిని వదులొకొమని సలహ ఇవ్వడం ఎమిటి ?
@@ "ఒక వేళ రెచ్చిపోవాల్సిందే అనుకుంటే, తాత ముత్తాతతల నుంచి వచ్చిన 'స్థితి' కూడా పూర్తిగా త్యజించి రమ్మనమని చెప్పండి. "
ఇది నాకర్దం కాలేదు. 'స్థితి' అంటే డబ్బా, సంఘం లొ పలుకుబడా, వాసరత్వం గా వచ్చిన తెలివితేటలా , లేక చదువుకొవాలన్న అలొచనా ..
ఇవన్ని వున్న నిమ్న వర్గాల వాడు రిజర్వెషన్ వదులు కుంటున్నాడా ?
@@ రిజర్వేషన్స్ అంటే ఇతర వర్గాల అవకాశాలను లాక్కోవడం కాదు. న్యాయమైన వాటా సాధించుకోవడం -
అందరికి న్యాయమయిన వాటా ఇదీ అని ఎవరు డిఫైన్ చెసారు. xx , yy, లేక అంబెత్కరా ? మీకు న్యాయమయిన వాటా నాకు న్యాయమనిపించడం లేదు. మీరు బలవంతులయితే మీకు న్యాయమయినది సాదించుకుంటారు. నేను బలవంతుడిని అయితే నాకు న్యాయమయినది సాదించుకొంటాను. బలవంతుడు వాడికి న్యాయమయినది సాదించుకొన్నప్పుడు , సాదించలేని వాడు వాడి అవకాశాలు లాక్కుంటున్నారు అనే అంటాడు. కావేరి జలాలు పంచుకొవడం లొ కర్నాటక కి న్యాయమనిపించిన వాటా తమిళ్నాడుకి కాదు. తమిళ్నాడుకి న్యాయమనిపించింది కర్నాటకకి కాదు. తమిళ్నాడు సుప్రీం కొర్టు తొ వాళ్ళకి న్యాయమయిన వాటా దక్కించుకుంతే కర్నాటక వాళ్ళు వాళ్ళ అవకాశాలను లాగెసుకున్నారు అంటారు. ఇక్కడ సుప్రీమే 50% రిజర్వేషన్ అప్ప్రోవ్ చేసింది అనకండి .. సుప్రీం లెవెల్ పార్లెమెంట్ లెవెల్ తరువాతమాత్రమె.
@@ 4. @ : "Science & Technology విషయం మళ్ళ ఎప్పుడయిన సెపెరట్ గా డిస్కస్ చెద్దాం" - అట్టే, మీరెప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ, ఎందరంటే అందరం ! మాట్లాడేస్కుందాము. -
నాకూ వాకే ..నేను రేడి.. మీరొక relevant పొస్టేసెత్తే మనం మాట్లాడెస్కొవచ్చు.
మొథం మెద మంచి చర్త్చ
నాకు తెలిసినథ వరకు
రిజర్వేషన్స్ వుండాలి
కాని
కొన్ని నిబందనల తొ
నాకు తెలిసినథ వరకు
రిజర్వేషన్స్ బాగ వెనుక బదిన వరెకి కులం తొ సంబందం లెకుంద ఆద్ర్దిక స్తొమతని బటి ఉందలి
మల్లి కొని నిబందనలు ఉంచలి
వుదహరనకు
రిజర్వేషన్స్ తొ చదువుకున్న వారు దేశానికి కొంథ కాలం
తకువ జితం తొ పని చెయలి (80%) సదరన జీతం లెద కొంత టాక్సు ఎకువ కటాలి
దీనివలన ఉన్నత ఆదయం వాలు రిజర్వేషన్స్ వాడుకొరు
దెనివలన రిజర్వేషన్స్ వ్రుధ చెయ బడవు
ప్రభుత్వం కూడ రిజర్వేషన్స్ ని పెంచ వచు, యందుకంతె ప్రభుత్వనికి కూడ లాబం కనుక
మొతం మీద బాగ పెద వలు అబివ్రుధి చెందుతారు
అసలు ముస్లిం లు క్రిష్టింలు రాజ్యాధికారం అనుభవించిన వర్గాలు ...ఒకప్పటి రాజులకు రిజర్వేషన్ ఎందుకు
దేశం ఎందుకు విడిపోయిందో గుర్తించని మూర్ఖులు రాజ్యమేలినంతకాలం మనం ఇలాంటి తిర్పులతో సంతోషించాలి అంతే
హిందువులందరూ కలసి వోటు వేయగలరు అనే భావన కుడా ఈ కుక్క బిస్కెట్ విసిరే రాజకీయాలను దూరం చేయగలదు-
చిన్న గీత ల పక్కన హిందువు అనే పెద్ద గీత గియాల్సిన సమయం వచ్చింది
Post a Comment