Subscribe:

Ads 468x60px

Pages

LEADERS ARE COMING FROM NORMAL PEOPLE WITH EXTRA ORDINARY SKILLS.

నా కాలేజ్ రోజులు ఇక తిరిగిరావు...........తిరిగిరావు.

ఇంటర్ పుర్తి అయింది ఇక ఎం చేయలి అనుకుంటున్న సందర్బంలో ..
'నువ్వు చదివిన ఉద్యోగం చేసి ఏ ఊరులు ఏలాలి రా... మనకు ఉన్నది చూసుకుంటే అంతకు పది ఇంతలు సంపాదించుకోవచ్చు, పిచ్చి వేషాలు వేయకుండా ఇక్కడే చదువుకో అన్నారు మా నాన్న.
దాంతో ఇంజనిరింగ్ కాలేజికి గాలిలో ఏగిరి పోతాను, ఏగిరి పోతాను అనుకున్న నేను మా గల్లి లో ఉన్న తుంబ్రి డిగ్రి కాలేజ్ చేరాను..

ఇంటర్ లో ఉన్న మా ఫేండ్స్ అంతా చాలా వరకు జాయిన్ అయ్యారు ఒక్కరిద్దరు తప్ప...
మెదటి సంవత్సరం డిగ్రి ..ఇంటర్ పుస్తాకాల లా బండేడు కాకుండా సింగిల్ నోట్ బుక్ తో సరిపోయింది.
ఏదో తేలియని మెండితనం,ధైర్యం అంతా నాకు నచ్చినట్టే జరగాలనే పంతం నాకు వంత పాడే నా స్నేహితులు.ఇలా క్లాస్ లో మా రాజ్యం స్ధాపించాం,

సంవత్స్రరం మెత్తం మీద మాకు మాహా అంటే ఒక్క నేల రోజులు జరిగివుంటాయి క్లాసులు, పిరియడ్ మెదలైనప్పటి నుంచి చివరి వరకు నవ్వులు, అల్లరి ,జోకులు,పంచ్ లు,బ్లాక్ బోర్డ్ మీద కవితలు, బోమ్మలు, అప్పుడే మైబైల్ అందరి చేతిలోకి వచ్చింది క్లాస్ ని డిస్టర్బ్ చేయలన్న ఉద్దేశ్యంతో ఒక్కరికోకరం missed calls ఇచ్చుకునే వాళ్ళాం.
పిరియడ్ మద్యలోంచి ఏలా బయటపడాలి అని అలోచించే వాళ్ళం సాయత్రం అయితే మా విధి చివర రాములన్న టి బంకు వేనక ఒక్క సిగరేటు ని పది మంది తాగే వాళ్ళాం..
మాలో ఏవడన్న ప్రేమిస్తే వాడి లవ్ లేటర్ లు మేము ఆ అమ్మాయికి అందించే వాళ్ళాం అదో గోప్ప ప్రేండ్ షిప్ అని ఫిల్ అయిపోయేవారం.

పరిక్షల భయాలు, అమ్మాయిలకి ఒక్క మార్కు ఏక్కవ వస్తె తేగ చదివేసా వాళ్ళాం.ఎలాగైనా వారి కన్న ఏక్కువ మార్కులు తేచ్చుకోని గోప్పగా ఫిల్ అయిపోయే వాళ్ళాం.అడామగా కాంపిటిశన్ ఏక్కువ గా ఉండేది మాలో మాకు కోల్డ్ వారులు.బయటికి మాత్రం మర్యదగా మట్లాడుకుంటాం.

పక్క విధిలో ఉన్న చంద్రశేఖర్ గాడి బ్యాచ్ అంటె మాకు పడదు ఏంటంటే అవి మా పదవ తరగతి నుంచి జరుగుతున్నాయి క్రికేట్ మ్యాచ్ ల నుంచి సినిమా హిరోల వరకు మాకు ఆ బ్యాచ్ కి అన్నిటి లో గోడవలె,
ఇవి వినాయక చవితి పండగ రోజు ఇంకా ఏక్కువ అవుతాయి మా వీధి లో గోప్ప అంటే కాదు మా విధిలో గోప్ప అని వాళ్ళు సచిన్ వినాయకుడి బోమ్మను తేస్తే మేము ధోని వినాయకుడిని..వాళ్ళు బైక్ మీద కుర్చున్న వినాయకుడి బోమ్మ తేస్తే మేము కార్ మీద కుర్చున్న వినాయకుడు ఇలా అన్నిటిలో పోటినే..

ఇక ఇంట్లో నేను మా అన్న ,
చిన్నవాడిని కాబట్టి నేనంటే నే అమ్మకు ఇష్టం, డబ్బులకు ,బైక్ లకు ,ఖర్చులకు ఏప్పుడు బెంగ లేదు , ఇక మా వదిన అమ్మకంటే ఏక్కువ నా ఖర్చుల భారం వదిన మీద కుడా ఉండేది,
మా నాన్న బైక్ కొనివ్వమంటే సాయత్రం రైస్ మిల్లు కి రా..కోనిస్తాను, అదివారం పోలం పనులు చూసుకో.శనివారం సినిమా హాల్ లో ఉండు.అని టైమ్ టేబుల్ పిక్స్ చేస్తారు.
ఇక మా అన్న ఏప్పుడు ఏదో పని చేస్తునే ఉంటాడు.. పిచ్చి సన్యాసి...అడగాలే కాని ఇంత వరకి ఏది కాదనడు.

అన్నిటి కన్న ముఖ్యం అయింది నా బైక్ splender + ఇదంటే నాకు ప్రాణం.
కాలేజ్ లో నా బైక్ కి నీడ అవసరం అని చేట్టు కింద పార్క్ చేసే వాడిని ఆ ప్లేస్ నాదే అయినట్టు లేక్క అక్కడ ఏవడన్న పార్క్ చెస్తే అడి టైర్ లో గాలి తిసేసే వాళ్ళాం.ఈ విషయం మై ఒక్కసారి వారం రోజులు నేను సస్పేండ్ అయ్యాను కారణం నేను గాలి తీసిన బైక్ మా ప్రస్సిపాల్ ది కావడం.

మేదటి సంవత్స్రం ఒక్క రోజులా గడిచిపోయింది. మా కాలేజ్ సహాయ సహకారలతో ఏమి రాని విజయ్ గాడు కుడా 60% తేచ్చుకున్నాడు..నేను పాస్ అయి రేండవ సంవత్సరం ...

రెండవ సంవత్సరం అల్లరి ఇంకాస్తా పేరిగింది ఇంతకు ముందు క్లాస్ నుంచి దాక్కోని పారిపోయేవాళ్ళాం..ఇప్పుడు దైర్యంగా బయటికి వేళ్ళిపోయే వారం..అదేంటో అబ్బాయిలు ఏప్పుడు ఫుల్ ప్రజేంట్ లేదు అమ్మాయిలు ఏప్పుడు నోస్ లేదు...అమ్మాయిలు మమల్ని డామినేట్ చేయకుండా కంట్రోల్ లో పేట్టాం పాపం వాళ్ళు కుడా ఈ వేధవలతో ఏందుకు
అనుకున్నారొ పేద్దగా పట్టించుకునేవారు కాదు.
అయితే అమ్మాలందరిని ఏవరిని కాలేజ్ నుంచి బయటికి పంపాలి అని అడిగితే ఒటింగ్ పద్దతిలో నన్నే ఏకగ్రివంగా ఏన్నుకునేవారు నేనంటే అంత అభిమానం.

ఫస్ట్ ఇయర్ లో మాష్టార్లు మాతో పేద్దగా కలిసి ఉండే వారు కాదు సేకండ్ ఇయర్ లో మాతో బాగా కలిసిపోయారు మాతో పాటు జోకులు వేసేవారు..మేము వేసే సేటైర్ లకి అల్లరికి చిరు నవ్వుతో స్పందించేవారు.మా తప్పులను కప్పిపుచ్చేవారు మాతో ఎంత కలిసి పోయారంటే స్నేహితుల కన్న ఏక్కువ .
ఇక అమ్మాయిలు కుడా ఇంతక ముందు లా కాకుండా మాతో ఫ్రిగా మాట్లాడేవారు రెండు మూడు జంటల లవ్ స్టొరిలు కుడా మేదలు అయ్యాయి
అలా ఉన్నా మాకు తగిలిన పేద్ద దేబ్బ నాగబుషణ్ అలియాస్ బంబం బోలే సార్ రాఖి రోజు అమ్మాయిలందిరి చేత మాకు రాఖిలు కట్టించాడు అ రోజు ప్రేమ జంటల బాధ అంత ఇంత కాదు మేము నవ్వలేక చస్తుంటే పాపం వాళ్ళు ఏడ్వలేక నవ్వారు..(నాకు ఆ బాధ లేదు నా డార్లింగ్ అసలు కాలేజ్ కి వేళ్ళదు..పది తోనే చదువు కు పాడే కట్టేసింది)

ఇలా రెండవ సంవత్సరం గడిచిపోయింది ఇక చివరి సంవత్సరం ఏంత ఏంజాయ్ చేసాం అంటే అసలు వాటిని మాటల్లో చేప్పాలను కోవడం నా అవివేకం .
కాలేజ్ మాకు అనందాన్ని పంచే దేవాలయం అయిపోయింది సేలవులు ఏందుకు వస్తాయా అని బాధపడే వాళ్ళాం అంతగా మేము ఎంజాయ్ చేసాము ..మాకు తేలియకుండా రోజులు గడిచిపోయాయి farewell party చాలా ఘనంగా చేసారు మా జునియర్స్.
ఫంక్షన్ రోజు మా మష్టారు చేప్పిన మాటలు నాకు మేదటిసారి జివితం లో ఏప్పుడు లేని బాద కలిగింది.
"బహుసా ఇదే మీ అందరు ఒక్కేసారి కలిసే చివరి రోజు తరువాత ఏవరి జీవితాలు వారివి అన్నారు" ఆ మాట వింటునే.అప్పటి వరకు ఫంక్షన్ ని ఏంజాయ్ చేస్తున్న మేము ’అవును మనం అంతా ఇక ఇలా ఒకేసారి కలవలేము ’ అన్న అలోచన రాగానే,ఇక జీవితం వద్దు ఇక్కడే ఉంటాం అనాలనిపించింది.ఇప్పటి వరకు అమ్మలా అదరించిన
కాలేజ్ ఇప్పుడు నీకు ఇక్కడ ఏం పని అంటుంది.ప్రతీ ఒక్కరి కళ్ళు కన్నిటితో తడిసాయి చేప్పలేని బాధ.

ఇప్పుడు ఆ నవ్వు లు లేవు , స్నేహితుల సోది మాటలు ,అల్లరి,చిలిపి తగదాలు, ఇప్పుడు ఏమి లేవు.
కాలేజ్ వైపు వేళ్ళాలి అన్న ఏదో తేలియని బాధా ఇక జివితం లో ఏప్పుడు తిరిగి రాని రోజులను తలుచుకుంటే తెలియని తడి కన్నుల్లో నిండింది..
దేవుడు వరం అడగమని చేబితె తిరిగి మూడు సంవత్సరాలు వేనుకకి పంపమని అడుగుతాను కాని అది జరగదు ఏందుకంటే its over.అ రోజులకి మిగిలిన చివరి అంకం పరిక్షలు ఈ నేల 23 నుంచి మేదలు అవుతాయి.


ITS
KATHA PAWAN

28 comments:

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Nice.

Swarnamallika said...

బాధపడకు పవన్. ఇలాంటి వేదన ప్రతిఒక్కరికి ఏదో ఒక సమయంలో కలిగే ఉంటుంది. కాకపొతే కాలం మాన్చలేని గాయం ఉండదు కదా. నువ్వు కూడా కొంతకాలానికి నీ జీవితంతో రాజీ పడిపోతావు. నీ వ్యాపారం పనులతో బిజీ అయిపోతావు. అయినప్పటికీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అందరిని కాకపోయినా దగ్గర స్నేహితులను పోగొట్టుకోకుండా ఉండొచ్చు. అందరి ఫోన్ నెంబర్లు తీసుకొని వారానికి ఒక్కసారైనా మాట్లాడచ్చు. నెలలో కనీసం ఒక్కసారి స్నేహితులందరూ కలిసి ఒక రోజంతా గడపచ్చు, పాత జ్ఞాపకాలు నెమరవేసుకోవచ్చు.

పవన్ said...

వీరుభొట్ల వెంకట గణేష్ గారు@
thanks

Swarnamallika గారు@
అవునండి మొబైల్ ఇప్పుడు చాలా వరకు దురాలను తగ్గించింది..కాని అందరం కాలేక్ రుమ్ లో చేసే అల్లరి ఆ అవకాశం ఇక ఉండదని బాధ.:)

పవన్ said...

కాలేక్ కాదు కాలేజ్

Anonymous said...

పవన్ బాగుంది దేవుడు వరం అడగమని చేబితె తిరిగి మూడు సంవత్సరాలు వేనుకకి పంపమని అడుగుతాను కాని అది జరగదు ఏందుకంటే its over ఇది చాలా బాగా చెప్పావు

s said...

simply super

జ్యోతి said...
This comment has been removed by a blog administrator.
nagarjuna చారి said...

విడిపోతున్నామనే బాధ మళ్ళి కలుసుకుంటామనే నిజాన్ని తెలియనివ్వకుండా చేస్తుంది.దాన్ని అనుభవించడం చాలా కష్టం.క్లాస్‌ రూం ఖుషి మాటల్లో చెప్పలేనిది. మీ స్నేహితులతో మీరు కలిసుండాలని కోరుకుంటున్నా.

రాఘవ said...

నా కాలేజ్ డేస్ ని గుర్తుచేసావ్ పవన్.నీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను.

రాఘవ

శరత్ 'కాలమ్' said...

మా కాలేజీ రోజులనీ, విడిపోయినప్పుడు కలిగిన ఆర్ద్రతనీ గుర్తుకుచేసారు. మంచి టపా వ్రాసారు.

Anonymous said...

good post u remembered me my college days the pain of farewelling best friends

నాగప్రసాద్ said...

తిరిగిరావు...తిరిగిరావు...తిరిగిరావు.. :))). అన్నట్టు రెణ్ణెళ్ళ తర్వాత నేను కూడా కాలేజీ నుంచి బయటికెళ్ళాలి. :(((.

అయినా ఊళ్ళోనే ఫ్రెండ్సందరూ ఉన్న నువ్వే ఇలా అంటే ఎలా? క్లాసులో అల్లరి లేకపోయినా చంద్రశేఖర్ గాడి బ్యాచ్‌తో గొడవలు ఉంటూనే ఉంటాయి కదా? :))).

ఇంకా కాలేజీ చదువు కావాలంటే, తర్వాత పీజీ చెయ్యి, అప్పటికీ చదువు బోర్ కొట్టకపోతే MBA చెయ్యి, ఇంకా విరక్తి పుట్టకపోతే PhD చెయ్యి, ఇంకా ఇంకా చదువుకోవాలనిపిస్తే విదేశాలకు చెక్కెయ్. :))).

అఫ్‌కోర్స్, నువ్వు ఇవన్నీ చేస్తానంటే, మీ ఇంట్లో వాళ్ళు నీ సర్టిఫికెట్లు లాక్కొని కాల్చిపడేసినా ఆశ్చర్యం లేదు. :))).

karthik said...

super post pavan!
meeting and parting is the way of life
parting and meeting is the hope of life

so be hopeful that you will be in touch with all your friends and continue enjoying!

నేను నా ఎంటెక్ ఫ్రెండ్స్ ని ఎవ్వరినీ వదల్లేదు తెలుసా.. ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడ మా వీధిలోనే ఉంటారు.. మిగిలిన వాళ్ళు కూడా అందరూ తచ్ లోనే ఉన్నారు..

-Karthik

Anonymous said...

జ్యోతి గారు,

మీరు సీనియర్ బ్లాగర్ గా నాకు తెలుసు. కాని మీరు పెట్టిన కామెంట్ చూసి చాలా ఆశ్చర్యం గా ఉంది. పాపం తనేదో తన ఆలొచనలను తన బ్లాగ్ లో రాసుకొన్నాడు. దానికి మీరు 'డబ్బు తో బాగా బలిసిన వాడివా పోగరుతొ కొట్టుకుంటున్నావు' రాయడం ఎం బాగ లేదు. మీరెనా కాదా అని మీ ప్రొఫైల్ లొకి వెల్లి చూసి ఈ కామెంట్ రాస్తున్నను. చూడపొతే మీరే పొగరు తోనో లేక ఇంకా కావరం తోనొ కొట్టుకొంటున్నట్లు వుంది.

Anonymous said...

జ్యోతి గారు,

మీరు సీనియర్ బ్లాగర్ గా నాకు తెలుసు. కాని మీరు నా పరుగు బ్లాగ్ లో పెట్టిన కామెంట్ చూసి చాలా ఆశ్చర్యం గా ఉంది. పాపం తనేదో తన ఆలొచనలను తన బ్లాగ్ లో రాసుకొన్నాడు. దానికి మీరు 'డబ్బు తో బాగా బలిసిన వాడివా పోగరుతొ కొట్టుకుంటున్నావు' రాయడం ఎం బాగ లేదు. మీరెనా కాదా అని మీ ప్రొఫైల్ లొకి వెల్లి చూసి ఈ కామెంట్ రాస్తున్నను. చూడపొతే మీరే పొగరు తోనో లేక ఇంకా కావరం తోనొ కొట్టుకొంటున్నట్లు వుంది

sowmya said...

పవన్ బాగా చెప్పావు. మరపు రావు కాలేజీ రోజులు అని అందుకే అన్నారు. ప్రతీ ఒక్కరి జీవితంలో వచ్చే మధురమైన రోజులవి.
మీ బైక్ లాగే నాకు సైకిల్. నేను కూడా సైకిల్ ని షెడ్ లో పెట్టేదాన్ని కాదు. నా కొత్త BSA SLR సైకిల్ కి ప్రత్యేకమైన స్థలం ఉండేది. అక్కడ నేను తప్ప ఇంకెవ్వరు పెట్టకూడదు. ఎవరైనా పెడితే, మూడ్ బాగుంటే పక్కకు జరిపేదాన్ని, లేకపోతే తోసేసి కింద పడేసేదాన్ని...హి హి హి.

ఒకరోజు సీనియర్ కురాళ్ళు నన్ను ఏడిపించడానికి నా సైకిల్ ని వేరే చోట పెట్టి దాని చుటూ కూర్చున్నారు. నేను వాళ్ళని చెడామడా తిట్టి వచ్చేసాను. మరుసటి రోజు నా సైకిల్ కి యధాతధంగా నా ప్లేస్ లో పెట్టి దాని హేండిల్ బార్ కి కాస్త గ్రీజు పూసాను. నాకు తెలుసు వాళ్ళు మళ్ళీ నా సైకిల్ మీద కన్ను వేస్తారని. అనుకన్నట్టు జరిగింది. వాళ్ళు నా సైకిల్ హేండిల్ బార్ ముట్టుకోగానే వాళ్ళ మొహాలు చూడాలి. నేను మా స్నేహితులంతా ఒకటే నవ్వు...ఇలాంటి చిలిపి పనులెన్నో. నాకు నా పాత రోజులని గుర్తు చేసినందుకు నీకు thanks !

కాలేజీ రోజులు మళ్ళీ రాకపోయినా మన స్నేహాన్ని పదిలంగా దాచుకోవచ్చు పవన్. నేను కాలేజీ వదిలి ఎన్నేళ్లయిన నాకు నా స్నేహితులతో స్నేహం ఇంకా కొనసాగుతూనే ఉంది. మేము మా ఊరెళ్ళినప్పుడలా కలుసుకుంటూనే ఉంటాం. ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉంటాము.

పవన్ said...

s,రాఘవ గారు@
thanks:0


nagarjuna చారి@
అ క్షణం విడిపోతున్నామనే బాధ తప్ప ఇంకేవి మా కళ్ళకి కనిపించలేదు..:)

శరత్ గారు
thanks మరి మీ కాలెజ్ రోజుల అల్లరి ఏలా ఉన్నది:)))))

పవన్ said...

నాగా @
"చంద్రశేఖర్ గాడి బ్యాచ్‌తో గొడవలు ఉంటూనే ఉంటాయి"
అవును నిజమే పుర్తి గా దూరం కాకపొయినా కాలేజ్ క్లాస్ రూమ్ లో ఉన్న unity,దైర్యం బయట రాదు..
ఇక నా ప్రణానికి మా నాన్న ఓక్కడు ఏప్పుడేప్పుడు రైస్ మిల్ నా నేత్తిన పేడదామా అని చుస్తున్నాడు..నేను b.ed చెస్తాను అంటే బతకలేక బడి పంతులు అని పాత సినిమా పంచ్ డైలాగ్స్ వేస్తున్నారు.
ఇక నువ్వు చేప్పిన చదువులంటే ఇంకేన్ని సిరియల్ డైలాగ్స్ అంటారో..

పవన్ said...

కార్తిక్ @
thanks...:)) నా ఫ్రేండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు అయితే మమల్ని అందరిని కలిపే కాలేజ్ ఇప్పుడు మాది కాదు..

sowmya@
నిజమే కాలేజ్ ఏప్పటికి మరచిపోలేని మధురమైన రోజులు..నా బైక్ ఫోటోలు త్వరలో పోస్ట్ చేస్తా...
నువ్వు కాని మా కాలేజ్ లో ఉండి ఉంటే మా పప్పులు ఉడికి ఊండవేమె.కదా..:)))thanks

పవన్ said...

Anonymous@
పై కామేంట్ జ్యోతి గారు రాయలేదు ఏవరో ఫేక్ రాసారు అవిడా అలాంటి మాటలు రాస్తారని నేను అనుకోను..మీ కామేంట్ కి దన్యవాదాలు

పవన్ said...

ఫేక్ బాబులు ఏందుక అయ్యా అంత తొందర చేప్పండి , ఒక్క నేల తరువాత ఏ పని పాట ఉండదు .24 గంటలు ఇక్కడే ఏలా కావలంటే అలా కుమ్మేసుకుందాం..అర్దం అయింది కదు.

మిస్టర్ యక్ష said...

పవన్,
ఒకసారి ఈ మాట చెప్పాను, నీకు సరిగ్గా అర్థమవ్వలేదు. నేను అన్నది నీ భాష మార్చుకొమ్మని కాదు. చాలా తప్పులు రాస్తున్నావు. ఒక సారి పోస్ట్ చేసే ముందు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 నిముషాలుకూడా పట్టదు దానికి.

ఏలగ, ఏకడ, చేపండి, బండేడు, తాప్పులూ, ఊన్నయి, ఈల రస్తూ పోతె చాదవడనికీ బాగ ఉండాదు.

So please, please pay attension before you post your next blog.

Malakpet Rowdy said...

ahhh I understand the issue now.

నేనిప్పటిదాకా ఈ పోస్ట్ చదవలేదు. అందుకే "అప్పుడెప్పుడో కాగడా బ్లాగులో ఎవరో పెట్టిన ఫేక్ కామెంట్ కి జ్యోతిగారు ఇప్పుడెందుకు రెస్పాండ్ అయ్యారా" అనే డౌటొచ్చింది.

I thought it was an attempt to distract the bloggers.

పవన్ said...

మలక్ గారు...
హహ

పవన్ said...

మిస్టర్ యక్ష.
నా బ్లాగులొ కామెంట్ రాసినందుకు దన్యవాదాలు..ఇక
తప్పులు రాస్తున్నాను నిజమే ఇంతకు ముందు ఇంకా చాలా తప్పులు రాసేవాడిని .ఇప్పుడే నయం..కాబట్టి రాస్తు ఉంటే అలవాటు అవుతుంది.
దయచేసి ఇంకోసారి నీతులు వద్దు ..ఇప్పటికి చాలా మంది చేప్పారు అర్దం చేసుకోండి...

ఏలగ, ఏకడ, చేపండి, బండేడు, తాప్పులూ, ఊన్నయి, ఈల రస్తూ పోతె చాదవడనికీ బాగ ఉండాదు.

ఇంత భయంకరంగా రాయడం లేదులేండి

please,please dont write about this topic again.

kkl.sandhya said...

dear pavan.nice

harsha said...

pavan mana college gurinchi rayadam chala bagundhi keep going

harsha said...

pavan mana college gurinchi rayadam chala bagundhi keep going

Post a Comment