
నాకు చిన్నప్పటి నుంచి ఒక్క అనుమానం, లోక రక్షకుడు దేవుడు అయినా నా రాముడు సీతను అనుమానించి అగ్నీ ప్రవేశం చేసి ఆమె శీలాన్నీ నిరూపించమని అన్నాడా ?
బ్లాగు లోకం లోకి కొన్ని కాకులు కూడా ఇదే కలరింగ్ ఇచ్చాయి.కొందరు ఆడ బ్లాగర్లు {అయితే పెర్లు వద్దులెండి} రాముడు అనుమానించాడని బ్యాడ్ బాయ్ అని కుడా రాసేటప్పటికి నేను నిజమే అని ఫిక్స్ అయ్య.
కాని నాకు ఈ పాయింట్ నచ్చలేదు "పాపం అంత కష్టపడి యుద్దంచేసి ఆఖరికి ఇలా అనుమానిస్తాడా అనుకునే వాడిని అయితే అది తప్పు అని, తెలియని వారు కూసిన కారు కూతలని నాకు ఈ మద్య తెలిసింది..
రామాయణంలో రాముడు ఎక్కడా సీతను అనుమానించి, శీలాన్నీ నిరూపించమని గాని, అగ్నీ ప్రవేశం చేయమని గాని చెప్పలేదంటా..సీతే తనకు తాను గా అగ్నీ ప్రవేశానికి సిద్దం అయిందని, అలా చెస్తే తను కాలి పోతానని అగ్నీ దేవుడు గజ గజ వణికాడు అని తెలిసింది.అది మన శ్రీ రాముడు. జై శ్రీరాం
అయినా తండ్రీ మాట కోసం రాజ్యాలను తృణప్రాయంగా త్యజించిన నా రాముడు ఏక్కడా?
పిల్ల కోసం తల్లిదండ్రులను ఎదిరించి పెళ్ళి చేసుకునే ఈ నాటి యువకులు ఏక్కడా..
అసలు అయనను నిందించడం కాదు పేరు చెప్పడానికి కుడా మనకు అర్హత లేదు.



32 comments:
http://mdileep.wordpress.com/2008/09/22/ramayanam_angi/
కత్తి మహేష్ కుమార్ గారు@
ముందు ఇవన్ని చదివే నేను అదే నిజం అనుకున్నాను.వాల్మి కి రామాయణం లో ఏక్కడా రాముడు సీతను అనుమానించి అగ్నీ ప్రవేశం చేసి ఆమె శీలాన్నీ నిరూపించమని లేదు.
ధర్మ సంరక్షణ కొరకు జన్మించిన పురుషోత్తముడు, సకల సుగుణాభిరాముడు, అరిషడ్వర్గాలను జయించినవాడు, అయిన భగవంతుడు ఇలా భార్యని అనుమానించడమన్న పని ఎలా చేస్తాడు అనే చిన్న లాజిక్ మనబోటి బుర్రతక్కువ వాళ్ళకి అర్థమయ్యే పనయితే .. ఇన్ని పిట్టకథలెందుకు? ఇంత కంఠశోషెందుకు?
శ్రీ రాముడి గురించి చెప్పిన మాటలు వినకుండా మీ అంతట మీరుగా సత్యాన్ని అన్వేషించడం నిజంగా హర్షణీయం... కీప్ గోయింగ్!!!!
----
సుధ
సుధ గారు దన్యవాదాలండి..
నిజంగా నాకెందుకో అసలు ఆ పాయింట్ నచ్చేది కాదు కాని చాలా మంది చెప్పెటప్పటికి నమ్మక తప్పలేదు కాని ఏలాగైనా పుర్తి విషయాం తెలుసుకోవాలనుకున్నాను... అన్నిటికి మూలమైనా రామాయాణం లో అసలు ఈ విషయం లేక పోవడం,,,, నిజంగా మిరు చెప్పినట్టు ఎంత బుర్రతక్కువ వాళ్ళమొ అర్దం అయింది
@పవన్: నమ్మకాలకు విఘాతం కలిగేలా ఉంటే ప్రక్షిప్తమనుకోవడం, నమ్మింది ప్రక్షిప్తమేమో అంటే మతవిరుద్దం అనుకోవడం మీలాంటోళ్ళకు మామూలే, మాలాంటోళ్ళకూ మామూలే.
అయినా మీరు చెబుతున్న వర్షన్ వాల్మీకే రాశాడని మీకు అంత గ్యారంటీగా ఎలా తెలిసిందబ్బా? ఇక బుర్రతక్కువతనం, మూర్ఖత్వం అంటారా...ఎంతవారికి అంత మహదేవా!
ఇది నిజమా?
-------
ఇది నిజం అనే బ్రమలో ఇన్ని రోజులు గడిపేస్తున్నాము
Explaining circular logic:
premise 1:శ్రీరాముడు అవతారపురుషుడు కనుక అన్నీ మంచి పనులే చేసి ఉండాలి.
premise 2: భార్యను అనుమానించడం మంచి లక్షణం కాదు
inference: రాముడు సీతను అగ్నిపరీక్ష చెయ్యమని అడగలేదు.
కత్తి మహేష్ కుమార్ గారు-
ఇక్కడ నేను రాసింది సత్యం గురించి నిజం గురించి..పది మంది కలిసి అబద్దాన్ని నిజం చెయగలరు,నిజాన్ని అబద్దం చేయగలరు...కాని ఉన్నదాన్ని ఏప్పటికి మార్చలేరు.. కదా, హిందు మతం మీద ఎంత తప్పుడు ప్రచారం జరుగుతుందో పైన మీరిచ్చిన లింగ్ చూస్తేనే తెలుస్తుంది
Explaining circular logic:
premise 1:శ్రీరాముడు అవతారపురుషుడు,అన్నీ మంచి పనులే చేసాడు.
premise 2: భార్యను అనుమానించలేదు...అలా అనుమానిస్తే అసలు రామాయణమే లేదు మీకు ఈ బాధ లేదు..
inference: రాముడు సీతను అగ్నిపరీక్ష చెయ్యమని అనలేడు
కత పవన్ గారూ,
మీ టపాకూ, నేను రాసిన దానికి తేడా ఏమిటో అర్ధం కాలేదు. ఇంతకూ మీ లాజిక్ circular logic అని మీరు ఒప్పుకున్నట్లేనా?
http://en.wikipedia.org/wiki/Circular_logic
సత్యాన్వేషి గారు,
నేను లాజిక్ ని కాదు నిజాన్ని ఒప్పుకుంటాను
పైన నేను ఇచ్చిన సమాధానం ఒక్కసారి మళ్ళి చదవండి ఆ లాజిక్ ఎంటో మీకు అర్దం అవుతుంది
నీ పొస్ట్ లొ విషయం ఎమొకాదు కానీ .. ఈ పొస్ట్ కి కామెంట్స్ అన్ని అయిపొయెసరికి నీకు మాములు జనాలాకి రిటార్డ్ లకి తెడా ఎంటొ తెలుస్తుంది.. :-))
రామయాణం జరిగిందె సీత కోసం యుద్దం చేసింది సంహారించింది అమె కోసమే అలాంటి రాముడు ఏలా అనుమానిస్తాడు...అనుమానపరుడే అయితే లక్ష్మణుని కావలిగా పేట్టి ఎందుకు వెళ్తాడు
మంచుగారు :)
@పవన్: నమ్మకాల్ని తర్కవిచారణకు పెట్టకండి.అభాసుపాలౌతారు.
మీరు చెబుతున్నది "నిజం"-fact అయితే మొదటిగా కావలసింది, ఆ ఘట్టంలో వాల్మీకి రామాయణంలో ఇచ్చిన వర్ణన. రెండవది అది వాల్మీకే రాసేడనే నిరూపణ.
ఇప్పటికి కొన్ని వేల రామాయణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.మెజారిటీ రామాయణాల్లో అగ్నిప్రవేశ ఘట్టం ఉంది. అంటే మూలకథలోనే ఉందో లేక అప్పటి సమాజానికి అనుగుణంగానో ఎవరైనా మారిస్తే అది సర్వజానామోదం చెంది ఇలా స్థిరపడిందో తెలీదు. కానీ రామాయణం కథలో అగ్నిప్రవేశం చాలా ప్రముఖమైన ఘటనగా స్థిరపడింది.
ఇది హిందూమతం మీద కుట్ర అని మీరు భావిస్తే, భావించండి. ఇలాంటి కుట్రలు మరిన్ని బయటపెట్టి మమ్మల్ని రక్షించే ప్రయత్నం చెయ్యండి.
మతగ్రంధాలలోని కధలను చారిత్రక ఋజువుల జోలికి పోకుండా,తర్కవిచారణకు పెట్టకుండానే భక్తులు నమ్ముతారు.మనం వినే రామాయణం ప్రకారం స్త్రీల కష్టాలకు సీత పరాకాష్ఠ.గుండె ద్రవించే సంఘటనలు ఆమె జీవితంలో జరిగాయి.అంత ఓర్పుతో ఎన్నో బాధలను అవమానాలను సహించి సత్యనిరతిని చూపించిన స్త్రీగా ఆమె మన హృదయాలను చూరగొంది.ఇన్ని రకాల బాధలు మరే స్త్రీకి కలగకూడనే భావం మనలో కలుగుతుంది.అన్యాయంగా బాధలు అనుభవించిన ఆమెపట్ల సానుభూతి పెరుగుతుంది.ఈనాడు ఏ స్త్రీకి సీతమ్మవారిలాంటి కష్టాలు కలగకూడదనే సద్భావనతో చట్టాలు తెచ్చి సంఘాన్ని మార్చుకోవాలి.ఆమె కధ అందుకు ఉపయోగపడాలి.
మనకు కలిగే సన్దేహాలకు అందులోనే జవాబు ఇమిడిఉంటున్న్ది అని వాసిస్టే రామాయణం చెప్పింది.మీరు అందుకు ఒక ఉదాహరణ్గా నిలిచి ,అయన చెప్పినదానిని రుజువు చేశారు./చల్లా.జయదేవానందశా/చెన్నై
అదలా ఉంచితే, గట్టిగా నలభై ఏళ్ళు లేనప్పుడు భార్యను లోకంకోసం అడవికి పంపాడు. ఆయన చక్రవర్తి, ఆరోజుల్లో బహుభార్యత్వం తప్పు కాదు. ఆయన తండ్రికే ముగ్గురు. అలాంటిది ఎంత ప్రేమ లేక పోతే ఆయన మళ్ళీ పెళ్ళి కాదు కదా ఇతర స్త్రీలను తలవను కూడా లేదు. చుట్టూ ఉన్నవాళ్ళు పెళ్ళి చేసుకోమని చెప్పినా వినలేదు. ఆయన లోకానికి వెరిచి పెళ్ళి చేసుకోకుండా ఉండలేదు. స్వచ్చందంగా ఇష్టంగా నిష్ట పాటించాడు. యోగి లా మిగిలిన జీవితం గడిపాడు. అసలు రాముడికి ముందు ఏకపత్ని వ్రతం అనే ఆదర్శం లేదు. మరి అది ఏ స్త్రీ వాదులు ఎందుకు పాంయింట్ చెయ్యరో. ఆయన చూపిన ఆ మార్గం భారత వివాహ వ్యవస్తకు ఇప్పుడు ముఖ్య ఆధారం. స్త్రీకి, పిల్లలకు ఆ రోజుకూ ఈ రోజుకూ ఎంతో రక్షణ ఇచ్చే హక్కు.
రామాయణం పట్ల నాకు గౌరవభావం ఉంది. కానీ అందులో సగం ప్రక్షిప్తాలే ఉన్నాయి. అసలైన రామాయణం ఎలా ఉండేదో మనకి తెలియదు. ఆయా కాలాల్లో ఆయా ప్రదేశాల్లో ఆయా ప్రజల సంస్కారానికీ, విశ్వాసాలకీ అనుగుణంగా ఆ కథని చాలా చాలా మార్చేశారు. వాల్మీకం అనే పేరుతో లభ్యమవుతున్న సంస్కృత రామాయణం కూడా ఇదే కోవకి చెందినది. ఈ రామాయణాల ఆధార్పడి రాములవారి గొప్పతనాని తగ్గించి చూపడం హాస్యాస్పదం. సామాన్యప్రజలు సాధారణంగా అవతార పురుషుల్ని అర్థం చేసుకోజాలరు. వాళ్ళని కూడా తమ లంపెన్ లెవెల్ కి దిగజార్చి చూసుకుంటే తప్ప వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అందువల్ల రాములవారి నుంచి మనమ్ ఎక్స్‌పెక్ట్ చేయని పామరప్రవర్తన రాములవారికి తరువాతి కాలంలో అంటగట్టబడిందని నా అభిప్రాయం. ఆ క్రమంలో ఆయన చేత సీతని హింసింపజేశారు. ఆ కథలు విని మనం కన్నీళ్ళు కారుస్తున్నాం. వాస్తవానికి సీతమ్మవారి కంటే రాములవారే ఎక్కువ కష్టాలనుభవించారు. కానీ అందరు మగవాళ్ళ విషయంలో మాదిరే రాములవారు కూడా ఏ విధమైన సింపతీకి నోచుకోలేదు.
నిజానికి మనకు తెలిసిన దాంపత్యధర్మాల్ని ప్రపంచంలో మొదటిసారిగా స్థాపించినది రాములవారే. అంతకుముందు వివాహవ్యవస్థకి సరైన రూపురేఖలు ఉండేవి కావు. ఆ సంసార అరాచకానికి దశరథుడూ, రావణుడూ, వాలిసుగ్రీవులూ దృష్టాంతాలు. భార్యాభర్తలనేవాళ్ళ మధ్య పెద్దగా కమిట్‌మెంట్స్ ఏమీ ఉండేవి కావు. రాములవారూ, సీతమ్మవారూ తమ పరస్పరప్రేమని లోకానికి ఆదర్శంగా చూపి ఆ పరిస్థితిని సమూలంగా మార్చారు. వారు ఏర్పరచిన ప్రిన్సిపుల్స్ తో వారిని జడ్జ్ చేయడం సమంజసం కాదు. వారి సమకాలీన సామాజిక పరిస్థితిని గమనంలో ఉంచుకోవాలి.
ఈవిషయం లో చర్చకు పాల్గొనదలచుకున్న వారందరూ క్షుణ్నంగా పదిసార్లకు తక్కువ కాకుండా రామాయణాన్ని [వాల్మీకం] చదవాలి .అలాచదివి నతరువాత మన మనసు చెబుతుంది . రామాయణాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో
నాకు చాలా సంతోషం గా ఉంది మొదట నేను ఈ పోస్ట్ రాసింది ఆ ఘట్టం గురించి ఇంకా వివరంగా తెలుస్తుంది అని...durgeswara గారు,దేవనకొండ ఓబుల్ రెడ్డి గారు,మైత్రేయి గారు కోత్త కోణం లో వివరించినందుకు మీకు నా ధన్యవాదాలు.
సీతమ్మ వారు ఓర్పు గల స్త్రి మూర్తి కాని అనె వెయ్యి రెట్లు నా రాముడు ఒర్పు సహానం గలవాడు....అయనని అనుమానపరుడు అనడం కారు కుతలే
దుర్గేశ్వర గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. రామాయణం అనేక సార్లు చదవాలి.
మైత్రేయి గారికి ఓ చిన్న సమాచారం. రాముడికి ముందు రాముడి తాతగారయిన అజుడు (భార్య ఇందుమతి), ఆయన తాతగారయిన దిలీపుడు (భార్య సుదక్షిణా దేవి) ఏకపత్నీవ్రతులే అనుకుంటాను. ఇది సమాచారం మాత్రమే. మీ అభిప్రాయ ఖండన కాదు.
kudos for your effort pavan....
@nagarjuna గారు
thanx:)
raamayanam oka katha.charitralo manaku chaala vishayalu correctgaa teliyavu.raamayanam anedi kaalanni batti,deshanni bhatti chaala maarpulaku lonaindi.mana kalla mundu jarigina vaatillo enno vasthvaalaku viruddanga pracharamlo vuntaayi.edi emaina manchi vishayaalanu ekkadavunna,evarucheppina sweekariddamu.gajula
వాల్మీకి రామాయణంలో ఏం ఉందొ ఇక్కడ చూడ వచ్చు.
http://www.valmikiramayan.net/yuddha/sarga115/yuddha_115_frame.htm
ఇది చదివిన తర్వాత రాముడు సీతని అగ్ని ప్రవేశం చేసి నిరూపించుకోమన్నాడని ఎందుకు మార్చారో సులభంగానే అర్థం అవుతుంది.
ఎంత పని చేశారు హరి గారు! ఎవరి నమ్మకాలతో వారిని ప్రశాంతంగా ఉండనివ్వరా?
ఇంకా నమ్మే వాళ్ళకోసం -
- అది అసలు వాల్మీకి రామాయణం కాదు. ఎక్కడో కుట్ర జరిగింది.
- అర్థం తప్పు ఇచ్చారు. ఆ మాటలకు వేరే అర్థాలు ఉన్నాయి.
- వాల్మీకి రామాయణాన్ని వదిలేయండి. మీరు ఏది నమ్ముతున్నారో అదే నిజం.
- అది రాసిన K.M.K. Murthy అంటే కత్తి మహేష్ కుమార్ మూర్తి కావచ్చు!
జోకులొదిలేస్తే -
అగ్నిలో దూకమనకున్నా అందుకు ప్రేరేపించడానికీ, దూకబోతుంటే ఆపకపోవడానికి కారణం సీతపై నమ్మకం లేకకాదు, లోకనిందకు జడవడం (6-118). అయితే ఆమె అగ్ని నుంచి మేను కందకుండా బయటికి వస్తుందని నమ్మినట్టు కనబడదు. అగ్నిపరీక్ష తర్వాత ముల్లోకాలకూ ఆమె పునీత అని తెలిసిందని చెప్పి మళ్ళీ అదే లోకనిందకు వెరిచి అడవుల్లో విడిచి రమ్మనమనడం ప్రక్షిప్తాల మహిమే అయి ఉండాలి.
హరి దోర్నాల గారూ
రామాయణం ప్రతిపదార్ధంతో సహా చదువుకోగలిగే వెబ్ సైట్ చూపించారు.ధన్యవాదాలు.6:115-10 "అశ్రు పరిప్లూత సీత".ఆమెను తలుచుకుంటేనే నాకు కన్నీళ్ళు వస్తాయి.
అజ్ఞాత గారు,
నమ్మే వారు రామాయణం చదవొద్దు అంటారా ఏమిటి?
మీరు నాలుగో పాయింటు మరిచారు, ఇది విదేశీయుల కుట్ర.
అది కత్తి మహేష్ కుమార్ గారు వ్రాసి ఉండరండీ. మరీ అంతటి ఆరోపణలు చేస్తే ఎలా?
ఎంత లోక నిందకు ఝడిసినా, సీతని లక్ష్మణుడి దగ్గరకో, విభీషణుడి దగ్గరకో, సుగ్రీవుడి దగ్గరకో వెళ్ళమని ఉచిత సలహా పారేయడం నాకైతే తేళ్ళు, జెర్రులు పాకినట్టనిపించింది. బహుశా ఆ మాటలకే సీత చితిని పేర్చుకొని వుంటుంది.
రహమతుల్లా గారు,
నాకూ ఈ లింకు అనుకోకుండా దొరికింది.
@హరి దొర్నాల:మీరిచ్చిన లంకె ఇప్పుడే చదివా. చాలా సహజంగా అనిపించింది.అందులో నాకైతే పెద్ద moral issues కనిపించలేదు. రాముడి patriarchal స్వభావం తప్ప. అదీ ఆ కాలానికి చాలా సహజమే అయ్యుండొచ్చు.
Post a Comment